twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటి, దర్శకురాలు విజయ నిర్మల ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్

    |

    Recommended Video

    నటి, దర్శకురాలు విజయ నిర్మల ఇక లేరు.. విషాదంలో టాలీవుడ్ || Filmibeat Telugu

    ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    నటుడు వీకే నరేష్ తల్లిగా

    నటుడు వీకే నరేష్ తల్లిగా

    తమిళనాడులో స్థిరపడిన కుటుంబంలో విజయ నిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. ఆమె అసలు పేరు నిర్మల. నటుడు వీకే నరేష్‌కు తల్లి. జయసుధకు పిన్ని అవుతారు. విజయశాంతికి కూడా ఆమె బంధువులు అవుతారు.

    పాతూరులోని బాల్యం

    పాతూరులోని బాల్యం

    విజయనిర్మల తల్లి శకుంతల. సోదరులు వసంతరావు, సంజీవరావు. పాతూరులో విజయ నిర్మల కుటుంబాలు ఉండేవి. విజయనిర్మల బాల్యం కూడా అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి మద్రాస్‌ వెళ్లిపోయారు. పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు.

    ఏడో ఏటనే బాలతారగా

    ఏడో ఏటనే బాలతారగా


    తన ఏడో ఏటనే 1950లో బాలతారగా మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించారు. 11వ ఏట పాండురంగ మహాత్యం అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. రంగులరాట్నం సినిమాతో హీరోయిన్‌గా మారారు. సుమారు 200 పైగా చిత్రాల్లో ఆమె నటించారు. తెలుగు, తమిళ మలయాళ చిత్రాల్లో తన ప్రతిభను చాటుకొన్నారు.

    గిన్నిస్ బుక్‌లోకి విజయ నిర్మల

    గిన్నిస్ బుక్‌లోకి విజయ నిర్మల


    విజయ నిర్మల నటిగా కొనసాగుతూనే దర్శకురాలిగా మారారు. సుమారు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ పరిశ్రమలో మహిళా దర్శకురాలిగా ఇదో రికార్డు. 2002లో అత్యధిక చిత్రాలు రూపొందించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు.

    డైరెక్టర్‌గా

    డైరెక్టర్‌గా

    దర్శకురాలిగా మీనా అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించారు. అప్పటి నుంచి 2009 వరకు మొత్తం 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువులు ఆరుకాయలు, హేమా హేమీలు, రాం రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది. భోగి మంటలు, లంకె బిందెలు, రెండు కుటుంబాల కథ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. 2009 నేరం-శిక్ష దర్శకురాలిగా ఆమె చివరి చిత్రం.

    English summary
    Vijaya Niramala no more, died with ill health
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X