twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయనిర్మల విగ్రహావిష్కరణ: కృష్ణ సహా హాజరైన సినీ ప్రముఖులు..

    |

    సినీ నటి, లెజండరీ దర్శకురాలు విజయనిర్మల ప్రథమ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. గతేడాది ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి జయంతి వేడుకల్లో భాగంగా ఆమె కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు చూద్దామా..\

     విగ్రహావిష్కరణ వేడుక.. హాజరైన కృష్ణ

    విగ్రహావిష్కరణ వేడుక.. హాజరైన కృష్ణ

    ఈ రోజు (ఫిబ్రవరి 20) విజయనిర్మల తొలి జయంతి సంద‌ర్భంగా నానక్‌రామ్‌గూడ లోని ఆమె నివాసంలో విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, నరేష్, కృషం రాజు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

     నమ్రతతో పాటు నరేష్ ఫ్యామిలీ

    నమ్రతతో పాటు నరేష్ ఫ్యామిలీ

    కొద్దిసేపటి క్రితమే విజయనిర్మల కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, కృష్ణ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహేష్ బాబు సతీమణి నమ్రతతో పాటు నరేష్ ఫ్యామిలీ అంతా విచ్చేశారు.

    విజయనిర్మల సినీ జర్నీ

    విజయనిర్మల సినీ జర్నీ

    200 లకు పైగా చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా, 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గొప్ప దర్శకురాలిగా కీర్తి గడించింది విజయనిర్మల. ఆమె జీవిత ప్రయాణంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. 2002 సంవత్సరం ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా రికార్డు సృష్టించింది విజయనిర్మల.

     సూపర్ స్టార్ కృష్ణతో ప్రయాణం..

    సూపర్ స్టార్ కృష్ణతో ప్రయాణం..

    అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబోలో వచ్చిన పలుచిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్‌ అయ్యాయి. ‘సాక్షి' చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో ఈ ఇద్దరూ కలిసి నటించడం విశేషం.

    Recommended Video

    Mahesh Babu To Take Care Of His Father Krishna || Filmibeat Telugu

    గతేడాది జూన్‌లో..

    న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, గిన్నీస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ సాధించిన మ‌హిళగా ఎంతో ఖ్యాతి పొందారు విజ‌య నిర్మ‌ల‌. గతేడాది జూన్‌లో ఈమె మ‌ర‌ణం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను శోకసంద్రంలో ముంచేసింది. సినీ లోకమంతా ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకొని చింతించారు.

    English summary
    Super Star krishna wife Vijaya Nirmala died last year. Now her statue unveiled by Naresh, Mahesh Babu, Krishna on her first birth anniversary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X