విజయదశమి విజయాన్నిస్తుంది అందుకే ఇది నా లక్కీ టైమ్: జూ ఎన్టీఆర్
మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఊసరవెల్లి విజయదశమి తనకు విజయాన్ని అందిస్తుందని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే నా ఫస్ట చిత్రం స్టూడెంట్ నెం.1 వచ్చింది కూడా ఇదే టైమ్ లోనే, రీసెంట్ గా బృందావనం కూడా అక్టోబర్ లోనే అందుకే ఇది నా లక్కీ టై అంటున్నారు జూ ఎన్టీఆర్. 'ఊసరవల్లి" సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫిల్మ్ నగర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా రోజున విడుదలవుతున్న 'ఊసరవల్లి" సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులను కోరారు. పైరసీని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు. కమర్షియల్ ఇమేజ్ ను వదలకుండా అన్ని రకాల సినిమాలు చేయాలన్నదే తన కోరిక అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. నిర్మాత బివీఎస్‌ఎన్ ప్రసాద్, దర్శకుడు సురేందర్‌రెడ్డి, రచయిత వక్కంతం వంశీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాగా 'ఊసరవెల్లి" మరో రెండు రోజులలో ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సిద్ధమౌతుంది. అక్టోబర్ 6న తెరపైకి వస్తున్న ఈ సినిమా తొలిరోజు 702 థియేటర్లలో రిలీజ్ కానుంది. చిత్ర ప్రభంజనానికి ఇది దోహదకారి కావచ్చు. 'ఊసరవెల్లి" చిత్ర విజయం పై ఇప్పటికే పరిశ్రమలో సానుకూల చర్చ జరుగుతుంది. కామెడీ మేళవించిన ఒక బ్యూటిఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మంచి మోతాదు లో యాక్షన్, థ్రిల్లింగ్ సన్నివేశాలు, ఆసక్తికరమైన మలుపులు ప్రేక్షకులను సీట్ల లో కట్టి పడేసే అవకాశం కనిపిస్తుంది. తొలిసారిగా జతకడుతున్న ఎన్టీఆర్-తమన్నా జంట పైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం శ్రోతలను బాగా అలరించింది. ఈ సినిమా పాటలు ఇప్పటికే ఉన్నత స్థానాన్ని పొందాయి. ఎన్టీఆర్ అసాధారణ నృత్యాలు ఈ చిత్రంలో వీక్షించ వచ్చు. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నిర్వహించారు. బి వి యస్ ఎన్ ప్రసాద్ నిర్మాత. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ సినిమా పంపిణీ అవుతుంది..


Click it and Unblock the Notifications











