మీసాల కృష్ణుడిని పెళ్లాడితే నిజంగా పెళ్లవుతుందని రాజబాబు అన్నట్టే తమ పెళ్లి అయిందని విజయ నిర్మల చెప్పింది. సాక్షి సినిమాలో కృష్ణుని వేషం వేసిన కృష్ణగారికి మీసాలు ఉన్నాయి. అంతేకాకుండా విజయనిర్మలతో ఈ సినిమాలో పెళ్లి కూడా అవుతుంది. సెట్ లో మీసాల కృష్ణుడి పెళ్లిని చూసిన రాజబాబు...మీసాల కృష్ణుడితో సెట్ లో ఉత్తుత్తిగానే పెళ్లి అయినా మీకు నిజంగానే పెళ్లి అవుతుంది..అన్నారు. మహానుభావుడు ఎక్కడున్నారో కానీ ఆయన అన్నట్టే మరో మూడు నెలల తరువాత తమ పెళ్లి అయిందని విజయ నిర్మల చెప్పింది. కృష్ణ తాను తిరుపతిలో పెళ్లి చేసుకున్నామని, పెళ్లికి ఇండస్ట్రీలోని తమ శ్రేయోభిలాషులంతా వచ్చారని ఆమె తెలిపింది.