సినీ పరిశ్రమలో హీరోలంతా ఆంధ్రావాళ్ళే..వారంతా నా ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారు...అంటూ మెదక్ లోక్ సభ అభ్యర్ధి విజయశాంతి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి రోడ్ షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఇరవై ఐదు ఏళ్ళ చలన చిత్ర జీవితంలో తాను తీసుకున్న రెమ్యునేషన్ చూసి ఆ ఆంద్రా హీరోలంతా కుళ్ళుకున్నారని ఆరోపించారు. అందుకే ప్రజా జీవితం గడపటానికే సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలని పరిష్కరించంతో పాలకులు విఫలమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు మారిన మనిషి అని ఆమె అన్నారు.