అందుకే పిల్లల్ని కనలేదు.. నా మరణం తర్వాత.. విజయశాంతి, చిరంజీవి, పవన్‌పై సీరియస్ కామెంట్

సినీ రంగంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడే లేడీ అమితాబ్ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. 2014లో ఓటమి తర్వాత సినీ, రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలపై, సినిమాలోని పరిస్థితుల గురించి మాట్లాడారు. తన వ్యక్తిగత, సినీ, రాజకీయ విషయాలపై ఆమె స్పందించారు. ఆమే ఏమన్నారంటే..

 ప్రజా సేవ కోసమే పాలిటిక్స్‌లోకి

ప్రజా సేవ కోసమే పాలిటిక్స్‌లోకి

సినిమా రంగంలో డబ్బు, హోదా అన్నీ చూశాను. ఆస్తులు కూడబెట్టుకోవడానికో, పేరు ప్రఖ్యాతుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే పాలిటిక్స్‌లోకి వచ్చాను. అంతే తప్పా డబ్బు సంపాదించడం నా ఉద్దేశం కాదు అని విజయశాంతి అన్నారు.

 ఆరోగ్యం క్షీణించడం వల్లే

ఆరోగ్యం క్షీణించడం వల్లే

2014 ఎన్నికల తర్వాత నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒక మేజర్ సర్జరీ జరిగింది. దానిని నుంచి కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. అందుకే సినీ రంగానికి, రాజకీయాలకు దూరంగా ఉన్నాను అని విజయశాంతి పేర్కొన్నారు.

 పిల్లల్ని కనొద్దని అనుకొన్నా

పిల్లల్ని కనొద్దని అనుకొన్నా

ప్రజాసేవలకు అంకితం కావాలన్న ఉద్దేశంతో నేను పిలల్ని కొనొద్దనుకొన్నాను. సంతానం ఉంటే ఆశ పెరిగిపోతుంది. స్వార్ధం ఎక్కువవుతుందని అనుకొన్నాను. అందుకే నేను నా భర్త, పిల్లల వద్దని అనుకొన్నాం. ప్రజలే పిల్లలుగా భావిస్తున్నాను.

 ఆస్తి మొత్తం ప్రజలకే

ఆస్తి మొత్తం ప్రజలకే

నా మరణాంతరం నా ఆస్తి మొత్తం ప్రజలకు చెందేలా చర్యలు తీసుకొంటాను. నా తల్లి పేరున, నా పేరున ఫౌండేషన్ ఏర్పాటు చేసి వాటికి నా ఆస్తిని మొత్తం ధారాదత్తం చేస్తాను. విద్య, వైద్యం కోసం నా ఆస్తిని కేటాయిస్తాను. ఈ విషయాన్ని మెదక్‌లో ఎప్పుడో చెప్పాను. ఓ దశలో నా నగలన్నీ తీసుకెళ్లి వెంకటేశ్వరస్వామి హుండీలో వేశాను. నాకు విలాసవంతమైన జీవితంపై ఆసక్తి లేదు అని విజయశాంతి వెల్లడించారు.

 ఆ కారణంగానే సినీ నటుల వైఫల్యం

ఆ కారణంగానే సినీ నటుల వైఫల్యం

సినీ నటులు చాలా సెన్సిటివ్. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుట్రలు, కుతంత్రాలకు తట్టుకోలేక స్వచ్ఛంద సేవ కోసం వెళ్తున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఎదురుదెబ్బలు తినాల్సి ఉంటుంది. వాటిని తట్టుకొంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చు.

దూకుడు మీద ఉన్న పవన్

దూకుడు మీద ఉన్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంచి దూకుడు మీద ఉన్నారు. ఆవేశపూరితంగా ప్రసంగాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్. ఆంధ్రా ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. రాజకీయాల్లో పవన్ కొట్లాడే తీరును బట్టి ఆయన విజయం సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండే కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని చివరి వరకు ఎలా నిలబడుతాడో వేచి చూడాల్సిందే.

 చిరంజీవితో కలిసి ప్రచారం చేస్తా

చిరంజీవితో కలిసి ప్రచారం చేస్తా

చిరంజీవి, నేను ఒకే పార్టీలో ఉన్న ఎలాంటి సమస్యలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి ప్రచారం చేయవచ్చు. హీరోగా, నాయకుడిగా ఆయనకు మంచి ప్రజాదరణ ఉంది. తెలంగాణలో ఆయన ప్రచారం చేయాలని నేను కోరుకొంటున్నాను. ఆయనతో కలిసి ప్రచారం చేస్తాను అని విజయశాంతి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X