రాజకీయాలతో బిజీ అయి పక్కన పెట్టేశా.. ఇదీ అసలు మ్యాటర్: విజయశాంతి

వెండితెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి దాదాపు పద్నాలుగేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. చివరగా 2006 సంవత్సరంలో 'నాయుడమ్మ' సినిమాలో కనిపించిన రాములమ్మ.. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయింది. తిరిగి ఇన్నేళ్లకు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ మళ్ళీ వెండితెర గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న విజయశాంతి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది.

తాను సినిమాలకి దూరమైన చాలా కాలానికి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యానని చెప్పింది. ఓ పవర్‌ఫుల్ రోల్‌తో తన రీ ఎంట్రీ జరగాలని భావించానని, ఈ మేరకు 'రాణి రుద్రమదేవి' టైటిల్‌తో రుద్రమదేవి చరిత్రను తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు చెప్పింది. తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమా రూపొందించాలని పక్కా ప్లాన్ చేసుకున్నాక, తాను రాజకీయాలతో బిజీగా ఉండటం కారణంగా ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశామని తెలిపింది. ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా అంటే పవర్‌ఫుల్ రోల్‌తో ఎంట్రీ ఇస్తున్నాని చెప్పింది. కాగా ఈ సినిమాలో తనది విలనిజం పండించే రోల్ కాదని కూడా క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.

 Vijayashanthi Comments On Her Re entry into Movies

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X