లౌక్ డౌన్‌లో లేడీ సూపర్ స్టార్.. లెజెండ్స్‌ను తలుచుకుంటూ గతంలోకి.. ఎమోషనల్ ట్వీట్స్

సౌత్ లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్‌గా స్టార్డమ్ సంపాదించకుంది విజయశాంతి. మధ్యలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినీ పరిశ్రమకు దూరమైంది. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో అందరూ ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది. విజయశాంతి ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎంతో గొప్పగా వినియోగించుకుంటోంది. అలాగే 'రైతు' గురించి గొప్పగా చెబుతున్న ఆనాటి సినిమాలలోని ఓ వీడియో క్లిప్‌ని కూడా ఆమె పోస్ట్ చేసింది. అసలు ఆమె ఎం చెప్పిందో ఓ సారి చూద్దాం.

 మరోసారి చూసే అవకాశం..

మరోసారి చూసే అవకాశం..

‘కొంత విరామంతో కొనసాగుతున్న ఈ ప్రస్తుత లాక్‌డౌన్ పరిణామం నాలో కలిగించిన ఒక ఉద్వేగభరిత భావంతో మన తెలుగు నటీమణుల, నటప్రవీణుల విద్వత్తు, ప్రతిభల సమున్నతను స్మరిస్తున్న సందర్భం ఇది. అత్యున్నత స్థాయికి చెందిన మన తెలుగు చిత్రాలను ఇంతకుముందు ఎన్నో పర్యాయాలు చూసినప్పటికీ ఇప్పుడు మరోసారి చూసే అవకాశం లభించింది.

భానుమతి గారితో మొదలై..

భానుమతి గారితో మొదలై..

భానుమతిగారితో ఆరంభమై.... కన్నాంబ, అంజలీదేవి, సావిత్రి, జమున, సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, కృష్ణకుమారి, సూర్యకాంతం, నిర్మలమ్మ, శారద, వాణిశ్రీ, రమాప్రభ, జయసుధ, జయప్రద, శ్రీదేవి గార్ల వంటి అందరూ... ఎస్వీ రంగారావుగారి నుండి రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, ధూళిపాళ, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, రాజబాబు, సత్యనారాయణ, రావుగోపాలరావు, కోట గార్ల వరకూ... ఇంకెందరో, ఎందరో, మన తెలుగు సినిమాను ప్రేక్షకుల కన్నులపంటగా తీర్చిదిద్దిన వరాల నటనా విశారదులు...

ఈ సమయం అందుకే..

ఈ సమయం అందుకే..

తెలుగు సినిమా ప్రారంభం నుండి, నేటి వరకూ ప్రజాభిమానం పొందిన హీరో పాత్రధారులు, స్టార్లు, సూపర్‌స్టార్లందరికీ సముచిత గౌరవాన్ని ఇస్తూ, పైన చెప్పిన వారందరినీ ఒకసారి, మరొక్కసారి గుర్తు చేసుకోగలిగిన జీవనగమన సంప్రాప్తత ఈ సమయం అని అభిప్రాయపడుతున్నాను. విజయశాంతి మూవీ ఆర్టిస్ట్' అని సుదీర్ఘ పోస్ట్ చేసింది.

Recommended Video

Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet
డిమాండ్స్ ఎక్కువ..

డిమాండ్స్ ఎక్కువ..

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో లెక్చరర్ భారతి పాత్రలో నటించిన విజయశాంతికి మంచి పేరు వచ్చింది. అయితే కొందరు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తే.. డిమాండ్లను చూసి షాక్ అయ్యారట. స్టార్ హీరో అయితేనే చేస్తాను, తనకు కూడా యాక్షన్ సీన్స్ ఉండాలని, రెమ్యూనరేష్ కూడా తగ్గించేది లేదని కండీషన్స్ పెట్టినట్టు టాక్. ఇప్పటి వరకైతే.. మరో ప్రాజెక్ట్‌ను ఓకే చేయలేదని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X