విజయశాంతిని తట్టుకోవడం కష్టమే.. నిజంగానే సరిలేరు అనిపించుకుంటుందా?

దాదాపు పుష్కర కాలంపాటు సినీ రంగానికి దూరమైన విజయశాంతి.. త్వరలోనే వెండితెరపై వెలగబోతోంది. లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్‌గా పేరు సంపాదించుకున్న ఈ రాములమ్మ ఓ సరైన పాత్రతోనే రీ ఎంట్రీ ఇస్తోందని ఇన్‌సైడ్ టాక్. అయితే విజయశాంతికి ఈ సినిమా కోసం బాగానే ముట్టజెప్పారని అప్పట్లో వార్తలు తెగ హల్‌చల్ అయ్యాయి. మరి ఈ సినిమా తరువాత విజయశాంతి రేంజ్ ఎలా ఉండోబోతుందన్నది చూడాలి.

మంచి చాన్స్ కొట్టేసిన దర్శకుడు

మంచి చాన్స్ కొట్టేసిన దర్శకుడు

ఎఫ్2తో భారీ హిట్టు కొట్టడంతో అనిల్ రావిపూడికి బాగానే లక్ కలిసి వచ్చింది. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్ బాబునే డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. ఇంతవరకు ఓ మోస్తరు హీరోలతో చేసుకుంటూ వచ్చిన అనిల్ రావిపూడి.. ఎఫ్2తో వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో చేశాడు. ఆ సినిమా వసూళ్ల పరంగా దుమ్ములేపడంతో.. మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్‌ను ఓకే చేయించాడు దిల్ రాజు. మహేష్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్దం చేసిన అనిల్.. ఎన్నో ప్రత్యేకతలతో స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు.

ప్రత్యేక పాత్రలతో ఆకర్షించేందుక ప్రయత్నం

ప్రత్యేక పాత్రలతో ఆకర్షించేందుక ప్రయత్నం

విజయశాంతి కోసం పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను బలంగా రాసుకున్నట్లు, అందులో ఆమెను నటించేలా చేయడం కోసం చాలా ప్రయత్నాలే జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఆమెకు పెద్ద మొత్తంలో ఇచ్చేందుకు సిద్దమైనట్లు టాక్. అయితే ఆ అమౌంట్ ఎంతా అన్నది బయటకు చెప్పడం లేదు కానీ నిర్మాతకు కళ్లు తిరిగేంత ఉంటుందని సమాచారం. బండ్ల గణేష్‌తో కూడా ఓ కీ రీల్ చేయించాడు దర్శకుడు.

విజయశాంతిని తట్టుకోవడమే కష్టమే..

విజయశాంతిని తట్టుకోవడమే కష్టమే..

ఒకవేళ విజయశాంతి పాత్రకు మంచి స్పందన వచ్చి.. మునుపటిలా క్రేజ్ వస్తే.. సినిమాలతో మళ్లీ బిజీ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. కానీ వరుస ప్రాజెక్ట్‌లతో ఆమె బిజీ అయితే.. పారితోషికం విషయంలో అటు నిర్మాతలు, రమ్యకృష్ణ, నదిలా లాంటి సీనియర్ హీరోయిన్లు విజయశాంతిని తట్టుకోవడం కష్టమేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగానే గతంలో లాగ బిజీ అయి సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటుందా? లేదా అన్నది చూడాలి.

సంక్రాంతి బరిలో..

సంక్రాంతి బరిలో..

సరిలేరు నీకెవ్వరు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనిల్ రావిపూడి..తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దమయ్యాడు. జనవరి 12న విడుదల కానున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాలకు చేరుకుంది. అక్కడ హీరో హీరోయిన్ల మీద పాటను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రష్మీక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X