twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితులు.. సుశాంత్ కేసుపై విజయశాంతి షాకింగ్ కామెంట్స్

    |

    బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై సీనియర్ నటి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వాస్తవాలను ఉదాహరణగా గుర్తు చేసుకుంటూ ఇలాంటి కేసుల విషయంలో అందరికి న్యాయం జరగాలని అధికారులు చాలా కష్టపడతారని, వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరమని ఆమె ఒక వివరణ ఇచ్చారు.

    ఇంతకంటే దారుణ పరిస్థితులు

    ఇంతకంటే దారుణ పరిస్థితులు

    బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ సూసైడ్ వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు గవర్నమెంట్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఘటనకు కారణమైన వారిని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు ఆదేశించడం మంచి పరిణామం. ఇక సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

    అనుమానాస్పదంగా మరణిస్తే..

    అనుమానాస్పదంగా మరణిస్తే..

    కానీ, వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించే విధంగా ఈ తరహాలో విచారణ, దర్యాప్తు జరిగాయా? ఎందరో నటీమణులు అనుమానాస్పదంగా మరణిస్తే నామమాత్రంగా కేసులు నమోదు, తూతూ మంత్రంగా విచారణ జరిపి చివరకి మమ అనిపించడమే చూశాము. నిజంగా సుశాంత్ కేసు విషయంలో బయటకొస్తున్న విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.

    ఎలాంటి వివక్ష ఉండకూడదు

    ఎలాంటి వివక్ష ఉండకూడదు

    సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవలని ఎన్నో ఆశలతో వచ్చే ఆర్టిస్టులు ఎవరికైనా సరే ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం బాధాకరం. అయితే దర్యాప్తు, విచారణ అనే విషయంలో ఎలాంటి వివక్ష ఉండకూడదు. ఎవరి విషయంలోనైనా సరే ఒకేలా ఉండాలి. ఈ విషయం ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ఈ విదంగా స్పందించారు.

     న్యాయం అనేది ఒకేలా

    న్యాయం అనేది ఒకేలా

    సాల్వే ఏమన్నారంటే.. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా ఎవరికైనా సరే న్యాయం అనేది ఒకేలా వర్తించినప్పుడే న్యాయాన్ని ఆశించగలమని సాల్వే అన్నారు. ఇలాంటి ఎన్నో సంచలనాత్మక కేసుల విచారణ విషయాలను గమనిస్తే, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో కష్టపడి న్యాయస్థానాలకు ఆధారాల్ని సమర్పిస్తాయి.

    Recommended Video

    Sarileru Neekevvaru @50 Days | Mahesh Babu Emotional Tweet
    శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్నా..

    శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్నా..

    ఆ కేసుల్లో ఆశించిన ఫలితాను రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు కూడా నీరుగారుతున్నాయి. ఆ దిశగానే ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది అంటూ విజయశాంతి వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    Rhea Chakraborty Deleted 8 hard Drives Data Of Sushant Singh. CBI in sushant singh rajput death investigation: Bollywood actress Rhea Chakraborty web Chat with drug dealers leaked. There many suspicious things in the whatsup chat comes into light. Now Narcotics Control Bureau came into Sushant Singh Rajput death invest
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X