పవన్ కల్యాణ్ భార్యపై అసభ్య పోస్టులు.. దేశం కాని దేశం అంటూ ట్రోల్స్‌పై విజయశాంతి ఆగ్రహం!

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన కొన్ని సినీ మరియు పొలిటికల్ అంశాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి అలాగే తెలుగు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా పలు వార్తలు ఉన్నాయి. కాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీలో తన మార్క్ సేవలు అందిస్తుండగా ఈ క్రమంలోనే తన కుటుంబంలో ఒక ఊహించని సంఘటన జరగడం సంచలనంగా మారింది.

కాగా పవన్ కళ్యాణ్ రెండో కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కి తాను చదువుతున్న సింగపూర్ స్కూల్ లో ఆకస్మిక అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కోసం దేశ ప్రధాని నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు స్వల్ప గాయాలతో ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడం అనేది ఉపశమనంగా నిలవగా తన కొడుకు క్షేమంగా తిరిగి రావడంతో పవన్ భార్య, మార్క్ శంకర్ తల్లి అనా లెజినోవా తన ఔదార్యాన్ని చాటుకోవడం కూడా వైరల్ గా మారింది.

Vijayashanthi stands for pawan kalyan wife anna lezhneva

కాగా మార్క్ కోలుకొని ఇండియాకి తిరిగి వచ్చిన నేపథ్యంలో తిరుమలేశుని సన్నిధికి వెళ్లి ఆమె తలనీలాలు అర్పించడం పైగా అక్కడ ఒకరోజు అన్నదానం మొత్తానికి 17 లక్షలు విరాళం అందించడం సహా అక్కడే తన చేతితో శ్రీవారి భక్తులకి వడ్డించి తినడం కూడా చాలా మందికి ఎంతో స్ఫూర్తిదాయకంగా మారింది. కాగా ఈ అంశంపై ఎంతోమంది ప్రశంసలు అందించారు. ఆమె రష్యాకి చెందినవారు అయినప్పటికీ హిందూ సంప్రదాయాలని ఎప్పుడు నుంచో గౌరవిస్తూ పాటిస్తూ వస్తున్నారు.

అయితే ఈ తిరుమల ఘటన విషయంలో అనాపై కూడా హేయమైన కామెంట్స్, ట్రోల్స్ రావడం అనేది ఒకింత బాధాకర అంశంగా మారింది. అసలు అందులో ఏం తప్పుందని విమర్శలు, కామెంట్స్ చేస్తున్నారు అనే మాటలు కూడా వచ్చాయి. కాగా ఈ నేపథ్యంలో అనాపై జరుగుతున్న సోషల్ మీడియా దాడిపై మన తెలుగు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి స్పందించడం అనేది సంచలనంగా మారింది.

"దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా గారిని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదు." అంటూ విజయశాంతి తన ఎక్స్ ఖాతా ద్వారా అందరికీ గట్టి కౌంటర్ తో ఇచ్చి పడేసారు.

దీనితో పవన్ అభిమానులు సహా మెగా అభిమానులు కూడా విజయశాంతి నుంచి ఈ తరహా సపోర్ట్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయశాంతి సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వగా ఇపుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో మరో కీలక పాత్ర చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X