సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ వచ్చేస్తున్నారు.. డబుల్ ధమాకా
మహర్షి సినిమాతో భారీ హిట్టు కొట్టిన సూపర్‌స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఎఫ్2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనిల్‌కు.. సూపర్‌స్టార్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ వచ్చింది.

ఎన్నో హంగులతో వస్తోన్న చిత్రం..
ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలతో రాబోతోంది. దాదాపు పద్నాలుగేళ్ల తరువాత స్క్రీన్‌పై లేడీ సూపర్‌స్టార్ విజయ్ శాంతి కనిపించబోతోంది. నిర్మాతగా మారిని బండ్ల గణేష్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు.

అదిరిపోయిన కాశ్మీర్ షెడ్యూల్..
ఈ మూవీలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తుండగా.. దానికి సంబంధించిన సన్నివేశాలను కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ చేసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని టాక్.
రామోజీ ఫిల్మ్ సిటీలో కొండారెడ్డి బురుజు సెట్
కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసింది. అందులోనే మహేస్ ఒక్కడు సినిమాలో ఆ సీన్ ఎంతగా నాటుకుపోయిందో తెలిసిందే. మళ్లీ అలాంటి అదిరిపోయే సీన్స్ ఈ సినిమాలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఈ సెట్ అద్బుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

దీపావళి కానుకగా..
దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు దర్శకుడు. నేడు ఈ మూవీ నుంచి రెండు పోస్టర్లను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఉదయం 9.09 గంటలకు విజయ శాంతి ఫస్ట్ లుక్, 5.04 గంటలకు మహేష్ బాబు పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











