విజయశాంతికి మళ్లీ ఏం కుట్టి ఇలా గబ్బు పట్టిస్తోందో..!
వెండితెరపై లేడీ అమితాబ్‌గా బిరుదును కొట్టేసిన విజయశాంతి, సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తల్లి తెలంగాణా పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. తల్లి తెలంగాణా కలసి రాకపోవడంతో ఆ పార్టీని తెరాసలో విలీనం చేసి, అటు పిమ్మట ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఎంపీ అయింది.
తెలంగాణ డివైడ్ అయితే ఒక్కడో ప్యారలల్ సినీ ఫీల్డ్ ఏర్పడే అవకాశాలున్నాయనే భ్రమల్లో వున్న కొందరు తెలంగాణ ఔత్సాహికుల్లో రాములమ్మ కూడా చేరింది. తనని తాను తెలంగాణ బిడ్డగా ప్రకటించుకోవడమే కాక. తాను తెలంగాణ హీరోయిన్ కనుకే అణిచేసారని గొంతు చించుకుంటోన్న విజయశాంతి మళ్లీ ముఖానికి రంగేసుకోడానికి ఇదే తగిన తరుణమని అనుకుంటోంది. యాక్టింగ్ బగ్ కుట్టడంతో మళ్లీ నటించడం మొదలు పెడితే ఎలా వుంటుందనే ఆలోచనని విజయశాంతి సీరియస్ గా చేస్తోంది. ఇది విన్నవారు ఇన్నాళ్లు రాజకీయాలను గబ్బుపట్టించిన విజయశాంతికి మళ్ళీ ఏం కుట్టిందో ఇప్పుడు సినిమా పరిశ్రమను గబ్బు పట్టించడానికి వస్తోందని విమర్శిస్తున్నారు.
'రాణి రుద్రమ దేవి" అనే చిత్రాన్ని తలపెడుతోంది. అన్నీ అనుకూలించి తెలంగాణ వచ్చేస్తే అప్పుడు చచ్చినట్టు తన సినిమాలు చూస్తారు కనుక, ఇప్పట్నుంచే ఫీల్డులో వుంటే మంచిదని రాములమ్మ ఉద్దేశం కాబోలు. ఏదేమైనా తెలంగాణ వాదాన్ని తమ స్వార్థానికి వాడుకునే వారిలో తాను చాలా మంది కంటే ముందుంటానని రాములమ్మ మళ్లీ మళ్లీ నిరూపించుకుంటోంది. అన్నట్టు తెలుగు సినిమాల్లో తెలంగాణ వారికి ప్రాధాన్యం లేదని నెత్తీ నోరూ బాదుకుంటోన్న విజయశాంతి తన సినిమాకి మాత్రం అంతర్జాతీయ నిపుణులని రప్పిస్తుందట. సాటి తెలుగోడు చేదు కానీ పరదేశీవాడైతే ముద్దు అన్నమాట!


Click it and Unblock the Notifications











