ఇంట్రస్టింగ్... చిరంజీవి, విజయశాంతి కలసి నటించబోతున్నారా?

1980, 90ల్లో చిరంజీవి, విజయశాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జోడీ. వీరి కాంబినేషన్లో వచ్చిన గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, కొండవీటి దొంగ, స్వయం కృషి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్నాయి. అప్పట్లో ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే సూపర్ హిట్టు అని ప్రేక్షకులు పీలయ్యేంతగా ప్రసిద్ధిగాంచారు. ఇద్దరూ కలిసి దాదాపు 15 చిత్రాల్లో నటించారు. చివరగా 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు మూవీలో నటించారు. త్వరలో మళ్లీ ఇద్దరూ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి సినిమాలో విజయశాంతి

చిరంజీవి సినిమాలో విజయశాంతి

దాదాపు 26 సంవత్సరాల తర్వాత చిరంజీవి, విజయశాంతి కలిసి నటించబోతున్నట్లుగా తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ‘సైరా' మూవీ చేస్తున్న మెగాస్టార్ దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో చిత్రానికి సిద్ధం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయశాంతి కూడా నటించబోతున్నారట.

కీలక పాత్రలో విజయశాంతి

కీలక పాత్రలో విజయశాంతి

చిరంజీవి హీరోగా రూపొందబోయే ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అత్యంత కీలకంగా ఉండేలా ఆమె పాత్రను రాశారట కొరటాల. తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. అయితే ఈ విషయమై చిత్ర బృందం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

సినిమా మొదలయ్యేది ఎప్పుడు?

సినిమా మొదలయ్యేది ఎప్పుడు?

‘సైరా' కోసం ఇంతకాలం తీరిక లేకుండా గడిపిన చిరంజీవి ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు. కొరటల శివ మూవీ సెప్టెంబర్ నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 2020 ఏప్రిల్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా షెడ్యూల్ చేసినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీ కోసం మెగాస్టార్ కాస్త బరువు కూడా తగ్గుతున్నారట.

విజయశాంతి రీ ఎంట్రీ

విజయశాంతి రీ ఎంట్రీ

2006లో వచ్చిన ‘నాయుడమ్మ' సినిమా తర్వాత సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిన విజయశాంతి.... మహేష్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు' ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇపుడు ఆమె చిరంజీవి సినిమా కూడా ఒపుకోవడాన్ని బట్టి చూస్తే ఇకపై వరుసగా సినిమాలు చేస్తారని స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X