సరైన సమయంలో మళ్లీ తెరపైకి వచ్చా.. చాలామంది ఫోన్ చేస్తున్నారు: విజయశాంతి
లేడీ అమితాబ్‌గా తెలుగు తెరపై సూపర్ పాపులారిటీ సంపాదించింది విజయశాంతి. సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన ఆమె అందరు అగ్ర హీరోల సరసన నటించింది. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిన ఆమె.. తిరిగి సరిలేరు నీకెవ్వరు సినిమాతో వెండితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. భారతిగా ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంది. ఈ సందర్బంగా కాసేపు మీడియాతో ముచ్చటించిన విజయశాంతి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.
చాలా సంవత్సరాల నుంచే అనేక మంది డైరెక్టర్లు సినిమా చేయమని అడుగుతున్నారు. కానీ రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల మళ్లీ నటించాలనే ఆలోచన రాలేదు. సినిమా అంటే సమయం కేటాయించాలి. ఇటు సినిమాల పరంగా, అటు రాజకీయపరంగా ఇబ్బంది పడలేను. గతంలో ఒకసారి అనిల్ రావిపూడిగారు సినిమా కోసం సంప్రదించారు. కానీ కుదరలేదు. ఈ సారి దర్శకులు అడిగినప్పుడు కొంత విరామం ఉంది. పైగా మహేష్ బాబు హీరో అనడంతో ఓకే చెప్పాను అని విజయశాంతి తెలిపింది.

ఇన్నేళ్లకు తిరిగి కెమెరా ముందుకు రావడం తనకేమీ కొత్తగా అనిపించలేదని విజయశాంతి చెప్పింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అంటారే. అలా సరైన సమయంలో విరామం తీసుకున్నా. సరైన సమయంలో మళ్లీ తెరపైకి వచ్చా అని విజయశాంతి తెలిపింది. సరిలేరు నీకెవ్వరుతో చాలా పెద్ద హిట్‌ను ప్రేక్షకులు ఇచ్చారు. చాలామంది ఫోన్‌లు చేసి నన్ను అభినందిస్తున్నారు. మిగతా భాషల పరిశ్రమల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయని విజయశాంతి పేర్కొంది.


Click it and Unblock the Notifications











