పిల్లల్ని కనకపోవడానికి కారణమిదే.. దిక్కులేనిదాన్నయిపోయా: విజయశాంతి
Recommended Video
మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి.. తన పెళ్లి, పిల్లలు, కెరీర్ సంబంధిత ఆసక్తికర విషయాలు పంచుకుంది.

విజయశాంతి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు
మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయట. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడం మొదలు నిర్విరామంగా, కంటి మీద కునుకు లేకుండా విజయశాంతి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో తన కష్టాల చిట్టాను బయటపెట్టింది విజయశాంతి.

అమ్మానాన్నలు పోవడంతో దిక్కులేనిదాన్నయిపోయా
తన 17 వ ఏటనే తండ్రి చనిపోయారని, ఆ తరువాత ఏడాది కాలంలోనే తల్లి కూడా చనిపోవడంతో తాను ఆ సమయంలో తాను దిక్కులేనిదాన్నయిపోయానని ఎమోషనల్ అయింది విజయశాంతి. తనను ఓ గొప్ప నటిగా చూడాలని తన తల్లిదండ్రులు ఆశపడే వారని ఆమె చెప్పింది. కనీసం తిన్నావా?పడుకున్నావా? అని అడిగే వారే లేని దుర్భర పరిస్థితిని తాను ఎదుర్కొన్నాని విజయశాంతి తెలిపింది.

అనుకోకుండా ఆయన పరిచయం
చాలా కష్టాలతో ఉన్న ఆ సమయంలో నిర్మాత శ్రీనివాసప్రసాద్‌గారు పరిచయం కావడం జరిగిందని, ఆయనే తనలో ఆత్మస్థైర్యం నింపారని విజయశాంతి పేర్కొంది. ఆ తర్వాత శ్రీనివాసప్రసాద్ నిర్మాణంలో వచ్చిన 'కర్తవ్యం' సినిమా ద్వారానే తనకు లేడీ అమితాబ్ గా గుర్తింపు వచ్చిందని, అలా అలా మీ అందరికీ బాగా దగ్గరయ్యానని ఆమె చెప్పుకొచ్చింది.

పెళ్ళై 32 ఏళ్లయింది.. కానీ
అదృష్టవశాత్తు తనకు మంచి భర్త దొరికాడని అంటోంది విజయశాంతి. 1988 మార్చి 29న మేం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, పెళ్ళై 32 ఏళ్లయింది. మాది అన్యూన్య దాంపత్యం. నా కష్టంలో ఎప్పుడూ వెంట నిలుస్తాడు నా భర్త. నా లైఫ్‌లో మా ఆయనే నా అసలు సిసలు హీరో అని చెప్పుకొచ్చింది విజయశాంతి.

అందుకే పిల్లల్నికనలేదు
తన భర్తకు, తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయశాంతి.. ఉద్యమం, పార్టీ లాంటి మొదలుపెట్టాక తమకు పిల్లల్ని కనాలని అనిపించలేదని పేర్కొంది. ప్రజల్నే తన పిల్లలుగా భావిస్తానని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది. పిల్లలు పుడితే, నేను వారి కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కొన్నిసార్లు నా పిల్లలనే స్వార్థం వచ్చే అవకాశం ఉంది. అందుకే పిల్లల్నికనలేదు అని తెలిపి ఆశ్చర్య పర్చింది విజయశాంతి.

సరిలేరు నీకెవ్వరు
దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా విజయశాంతి కళ్ళు చెదిరే పర్‌ఫార్‌మెన్స్ కనబర్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications