'సరిలేరు నీకెవ్వరు' సీక్రెట్స్ చెప్పేసిన రాములమ్మ.. మహేష్‌తో నాకు అంటూ ఓపెన్!
ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన విజయశాంతి గత పద్నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చిరవగా నాయుడమ్మ సినిమాలో కనిపించిన ఆమె.. ఆ తర్వాత రాజకీయాలతో బిజీ అయింది. అయితే ఉన్నట్టుండి ఆమె మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇస్తుండటం సినీ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది.
ఇప్పటికే ఆమె సరిలేరు నీకెవ్వరు సెట్స్ పైకి వచ్చేసింది కూడా. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీపావళి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి విజయశాంతి లుక్ రిలీజ్ చేయడమే గాక ఆమె క్యారెక్టర్ పేరు భారతి అని చెప్పేశారు. అయితే ఈ సినిమాలో మహేశ్ బాబు, విజయశాంతి మధ్య నువ్వా? నేనా? అనేలా పవర్ ఫుల్ సన్నివేశాలుంటాయని కొన్ని రోజులుగా బలమైన టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ ఇష్యూపై స్పందిస్తూ ఓపెన్ అయింది రాములమ్మ.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తనకు, మహేష్ బాబుకు మధ్య పోటాపోటీ సన్నివేశాలేమీ వుండవని క్లారిటీ ఇచ్చింది. ఛాలెంజ్ చేయడం, సవాళ్లు విసురుకోవడం వంటి సీన్స్ ఉండవని చెప్పేసింది. కథాపరంగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా మా పాత్రల మధ్య మంచి రిలేషన్ ఉంటుందని తెలిపింది. రీ ఎంట్రీ తరువాత సాఫ్ట్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వాలని తాను భావిస్తున్నట్లుగా పేర్కొంది రాములమ్మ.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోంది సరిలేరు నీకెవ్వరు సినిమా. ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











