RRR గురించి క్లారిటీ ఇచ్చేసిన విజయశాంతి.. ఇక రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పడ్డట్టే!

గత రెండు దశాబ్దాల క్రింద తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హీరోయిన్ విజయశాంతి. ఎన్నో సినిమాల్లో నటించి లేడీ అమితాబ్ బచ్చన్‌గా పేరు తెచ్చుకుంది ఈ రాములమ్మ. అప్పట్లో అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈమె గత కొంతకాలంగా వెండితెరకు దూరమై తిరిగి ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో విజయశాంతి సినిమాల విషయమై రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా జరిగిన ఓ సమావేశంలో వాటిపై క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.

వెండితెర ప్రయాణానికి ఫుల్‌స్టాప్.. ఆ వెంటనే

వెండితెర ప్రయాణానికి ఫుల్‌స్టాప్.. ఆ వెంటనే

2006లో వచ్చిన ‘నాయుడమ్మ' సినిమా తర్వాత వెండితెర ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టింది విజయశాంతి. సినిమాలకు దూరమై రాజకీయాల్లోకి వెళ్లిన ఆమె..13 ఏళ్ల తర్వాత తిరిగి వెండితెర వైపు చూస్తోంది. మహేష్ బాబు హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈమెపై ఎన్నో వార్తలు పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్లు.

 RRR సినిమాలో విజయశాంతి

RRR సినిమాలో విజయశాంతి

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు RRR. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. దీంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పాటు RRR లో కూడా విజయశాంతి నటిస్తోందని, కానీ ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారని వార్తలు వెలువడ్డాయి.

రాములమ్మ రియాక్షన్

రాములమ్మ రియాక్షన్

దీంతో తనపై, తాను నటిస్తున్న సినిమాలపై వస్తున్న వార్తల గురించి స్పందించింది విజయశాంతి. తాను 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తప్ప మరే సినిమాలో నటించడం లేదని, RRRలో నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటిదాకా విజయశాంతి సినిమాల గురించి వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

 'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి

'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నటిస్తోంది విజయశాంతి. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన ఈమె ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయశాంతి రోల్ కథను మలుపుతిప్పేలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకొని ఉంటుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X