మహేష్ బాబు వ్యక్తిత్వంపై విజయశాంతి కామెంట్.. వైరల్‌గా మారిన ట్వీట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తోంది విజయశాంతి. దీంతో ఈ సినిమాలో ఈమె పాత్ర ఎలా ఉండనుందనే దానిపైనే అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు, విజయశాంతి మధ్య జరిగిన ట్వీట్ సంభాషణ వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

Recommended Video

Tamannaah Special Song In Sarileru Neekevvaru
30 సంవత్సరాల గ్యాప్.. మళ్ళీ ఇప్పుడు

30 సంవత్సరాల గ్యాప్.. మళ్ళీ ఇప్పుడు

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. విజయశాంతితో కలిసి 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో నటించారు. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల అనంతరం మళ్లీ ఆమెతో సరిలేరు నీకెవ్వరులో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగినట్లు ఉంది అంటూ

‘‘1989లో తొలిసారిగా విజయశాంతిగారిని కలిశాను. లొకేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం' మూవీ సెట్స్. 30 సంవత్సరాల తర్వాత విజయశాంతిగారితో మళ్లీ కలిసి పని చేస్తున్నాను. లైఫ్ ఒక ఫుల్ సర్కిల్ తిరిగినట్లు ఉంది'' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

స్పందించిన విజయశాంతి.. మహేష్ వ్యక్తిత్వంపై

స్పందించిన విజయశాంతి.. మహేష్ వ్యక్తిత్వంపై

మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌పై విజయశాంతి తనదైన స్టైల్ లో స్పందించింది. ''కాలగమనంలో సాధారణంగా అయితే ప్రకృతి మార్పును తీసుకొస్తుంది. కానీ మహేష్ బాబుగారి వ్యక్తిత్వంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆయన మనసే ఆయనకు గొప్ప అభరణం. 1989లో మా కాంబినేషన్ మొదలవ్వడానికి ముందు.. ఇదే రోజు 1980‌లో ‘కిలాడీ కృష్ణుడు' చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణగారితో జంటగా నా సినీ ప్రయాణం మొదలైంది. కళ అనేది అనంతం. అది మీలాంటి వారి వల్ల భ్రమణం చేస్తుంది'' అని పేర్కొంది.

ఆర్మీ మేజర్ మహేష్.. విజయశాంతి పాత్ర

ఆర్మీ మేజర్ మహేష్.. విజయశాంతి పాత్ర

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ బాబు ఫ్రెండ్ తల్లిపాత్రలో విజయశాంతి కనిపించబోతున్నట్లు సమాచారం. లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ప్రిపేర్ అవుతున్నారు. రోజూ జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆమె స్లిమ్ లుక్‌లో కనిపిస్తారని తెలుస్తోంది.

సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

‘సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్‌రాజ్, నరేష్, సంగీత, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్, పవిత్ర లోకేష్, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 10, 2020న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X