ఇక సెలవు అంటూ విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. హాట్ టాపిక్ అవుతున్న ఇష్యూ
ఇటీవలే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ అమితాబ్ విజయశాంతి. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సినీ గడప తొక్కిన ఈమె భారతి అనే క్యారెక్టర్ చేసి బాగా ఆకట్టుకుంది. సరిలేరు నీకెవ్వరు ఆమె కీలక పాత్ర పోషించింది. దీంతో ఇక రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ విజయశాంతి జోష్ కనిపిస్తుందని, ఆమె వరుస సినిమాల్లో నటిస్తుందని భావించారంతా.
కానీ తాజాగా తన సినీ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేసి పలు అనుమానాలకు తెరపిండి విజయశాంతి. ప్రజా జీవన పోరాటంలోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆమె ప్రకటించింది. మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదని చెబుతూ ఇప్పటికి ఇప్పటికి సెలవు అని చెప్పేసింది.

మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది విజయశాంతి. 'సరిలేరు నీకెవ్వరు' వంటి గొప్ప విజయాన్ని నాకు అందించి, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అని చెప్పారు.
1979లో 'కళ్లుకుల్ ఇరమ్' సినిమా నుంచి ఇప్పటి 'సరిలేరు నీకెవ్వరు' వరకు తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు అంటూ వరుస ట్వీట్స్ చేసింది ఈ లేడీ అమితాబ్. దీంతో ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











