twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prudhvi Raj: కోర్టుకెక్కిన కమెడియన్ పృథ్వీరాజ్ భార్య.. ప్రతి నెల రూ. 8 లక్షలు చెల్లించాలని తీర్పు

    |

    నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే ఒక్క డైలాగ్ తో ఎంతో పాపులర్ అయ్యాడు. చిన్న స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి స్టార్ కమెడియన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. నటుడిగానే కాకుండా పొలిటికల్ గా కూడా మంచి ఇమేజ్ ను సాధించాడు పృథ్వీరాజ్. అయితే అప్పుడప్పుడు ఈ కమెడియన్ పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు ఈ కమెడియన్. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కు షాక్ ఇచ్చింది. ఆయన భార్య వేసిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

     థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

    థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..

    టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్. ఖడ్గం చిత్రంలోని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో సూపర్ పాపులర్ అయ్యాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అయితే ఈ నటుడిని అప్పుడప్పుడు వివాదాలు పలకరిస్తూ ఉంటాయి. తాజాగా పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

     రూ. 8 లక్షలు భరణంగా..

    రూ. 8 లక్షలు భరణంగా..

    పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి వేసిన కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది విజయవాడ ఫ్యామిలీ కోర్టు. పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతినెల రూ. 8 లక్షలు భరణంగా చెల్లించాలని అతన్ని ఆదేశించింది. పాపులర్ కమెడియన్ గా టాలీవుడ్ లో పేరు సంపాందించుకున్న పృథ్వీరాజ్ కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1884లో వివాహం జరిగింది.

     2017లో జనవరి 10న..

    2017లో జనవరి 10న..

    ఫలితంగా.. తాడేపల్లి గూడానికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్-శ్రీలక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే 2017లో జనవరి 10న తన భర్త నుంచి ఆమెకు నెలకు రూ. 8 లక్షల భరణం కావాలిని కేసు వేశారు. సినిమాలు, సీరియళ్ల ద్వారా బాగా సంపాదిస్తున్న పృథ్వీరాజ్ తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆమె తెలిపారు. పెళ్లయిన తర్వాత తన భర్త విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసేవారని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని ఆమె పేర్కొన్నారు.

    చిత్ర హింసలు పెట్టాడంటూ..

    చిత్ర హింసలు పెట్టాడంటూ..

    అంతేకాకుండా తనను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ వేధించేవాడని శ్రీలక్ష్మి ఆరోపించారు. నోటికొచ్చింది తిడుతూ తనను చిత్ర హింసలు పెట్టాడంటూ ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా ఇలానే చేస్తూ చివరకు తనను 2016 ఏప్రిల్ 5న ఇంటినుంచి గెంటేశాడని ఆరోపించారు. దీంతో మరో దారిలేక పుట్టింటికి వెళ్లానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

    నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాడు..

    నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాడు..

    సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాడని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోర్టును కోరారు శ్రీలక్ష్మి. సుమారు నాలుగేళ్లకుపైగా కొనసాగిన ఈ కేసులో చివరికి తీర్పు వచ్చింది. కేసును విచారించిన 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పునిచ్చారు.

    లైంగిక వేధింపుల ఆరోపణలు..

    లైంగిక వేధింపుల ఆరోపణలు..

    ప్రతి నెల 10వ తేది నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న అయిన మొత్తాన్ని కూడా చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నాడు పృథ్వీరాజ్. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పృథ్వీరాజ్ కు ఎస్వీబీసీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఆ పదవి నుంచి తొలగించారు.

    English summary
    Tollywood Actor And Comedian Prudhvi Raj Gets Order From Vijayawada Family Court To Pay His Wife Sri Lakshmi Rs 8 Lakh Per Month As Alimony.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X