twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథ విషయంలో భేదాభిప్రాయాలు.. రాజమౌళి అనుకున్నట్లే చేస్తాడు.. విజయేంద్ర ప్రసాద్!

    |

    Recommended Video

    Jersey Movie Review By Baahubali Director SS Rajamouli || Filmibeat Telugu

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. రాజమౌళి చిత్రాలకు తన ఫ్యామిలీ సహకారం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాము ఇంట్లో ఒకలా, సెట్స్ లో మరోలా ఉంటాం అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

     ఊహించలేదు

    ఊహించలేదు

    విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ.. తన కుమారుడు ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడని అసలు ఊహించలేదు. ప్రస్తుతం తాను రాజమౌళి పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. తామిద్దరం ఇంట్లో ఇప్పటి మోడ్రన్ తండ్రీ కొడుకుల్లా స్నేహితుల్లా ఉండం. ఇంట్లో తండ్రిగా నాదే ఆధిపత్యం. తాను పాతతరం తండ్రిలాగే ప్రవర్తిస్తుంటానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

    కథని అద్భుతంగా

    కథని అద్భుతంగా

    రాజమౌళితో కథని అద్భుతంగా చెప్పగలిగే నైపుణ్యం ఉందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంట్లో తాను ఆధిపత్యం చెలాయిస్తే.. సెట్స్ లో మాత్రం అతడే బాస్. నేను రచయితని మాత్రమే అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దర్శకుడు కాకముందు నుంచే నాకు కథ విషయంలో రాజమౌళి సాయం చేసేవాడు. అలా దర్శకత్వ నైపుణ్యాలు పెంచుకున్నాడు అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

     భేదాభిప్రాయాలు

    భేదాభిప్రాయాలు

    సినిమా స్క్రిప్ట్ విషయంలో భేదాభిప్రాయాలు గురించి మాట్లాడుతూ.. అవి మామధ్య ఎప్పుడూ ఉండేవే. నేను చెప్పిన విషయాలని రాజమౌళి చాలా సంధర్భాల్లో ఒప్పుకోలేదు. తాను అనుకున్నదే చేస్తాడు అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కెప్టెన్ అతడే కాబట్టి నేను అంగీకరించాల్సిందే అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ చాలా కాలం పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసిన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రారంభించాడు.

    కల్పిత గాధగా

    కల్పిత గాధగా

    ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. 1920 కాలంలో స్వాతంత్ర నేపథ్యంలో జరిగే ఈ కథని కల్పిత గాధగా రాజమౌళి చూపించబోతున్నాడు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    English summary
    Vijayendra Prasad about Rajamouli.. I did not expect he will became star director. Now Rajamouli busy with NTR, Ram Charan's RRR movie. DVV Danayya producing this movie with 400 cr budget
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X