Akira Nandan: అకీరా ఎంట్రీపై రాజమౌళి తండ్రి కామెంట్.. రేణు దేశాయ్‌కు రిక్వెస్ట్.. ఎవడూ నిలబడడు అంటూ!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్న స్టార్ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం వేచి చూస్తున్న అతడు.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే సినిమాను చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీలో రేణు దేశాయ్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ రైటర్, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ గురించి కామెంట్ చేశారు. ఆ వివరాలు మీకోసం!
టైగర్ నాగేశ్వర్రావుగా రవితేజ:మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన సినిమానే 'టైగర్ నాగేశ్వర్రావు'. ఈ మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు.

కథను నడిపే పాత్రలో రేణు:తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్‌తో వివాహం తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత ఆమె ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే సినిమాలో నటించారు. ఇందులో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేశారు. ఇది సినిమా కథను నడిపించే ముఖ్యమైన రోల్ అని తెలుస్తోంది.
గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్:పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని అక్టోబర్ 20వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఫంక్షన్ తారల తళుకుబెళుకుల మధ్యన ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.

రవితేజను ఎవరూ చేరలేదు:'టైగర్ నాగేశ్వర్రావు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ రచయిత వీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన ఈ వేడుకలో మాట్లాడుతూ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ముఖ్యంగా 'విక్రమార్కుడు సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు. కానీ, ఎవరూ రవితేజ గారిని మ్యాచ్ చేయలేకపోయారు. అది ఆయన స్టామినా' అంటూ ప్రశంసించారు.
ఎవడూ నిలబడలేరంటూ:ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఇప్పుడు దసరా సీజన్ నడుస్తోంది. అమ్మవారి వాహనం టైగర్. ఆ టైగర్‌ను ఎలా ఆపలేరో.. ఇప్పుడు రాబోయే ఈ టైగర్‌ను కూడా ఎవరూ ఆపలేరు. ఈ టైగర్ నాగేశ్వర్రావు ముందు ఎవడూ నిలబడలేడు. ఈ దసరా మీదే. ఇందులో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లకు ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ నా మనసు దోచేశారు' అని చెప్పొకొచ్చారు.

అకీరాను హీరోను చేయండి:ఇదే వేడుకలో విజయేంద్ర ప్రసాద్ కొనసాగిస్తూ.. 'రేణు దేశాయ్ గారు.. మీరు సినిమాలకు దూరంగా ఉండొచ్చు. కానీ, మీరంతా మాకు దగ్గరే. మీ అబ్బాయి అకీరాను వీరు వీలైనంత త్వరలో హీరోను చేయాలి. అందులోనూ మీ అబ్బాయికి మీరే తల్లిగా నటించాలి' అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతుండగా రేణు దేశాయ్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు.


Click it and Unblock the Notifications











