బాహుబలి తరహాలో 'ఆర్ఆర్ఆర్' ఏమైనా.. కలిసే అవకాశం ఉంది.. విజయేంద్ర ప్రసాద్!

Recommended Video

Vijayendra Prasad Gives Hint About RRR Story

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న రూపొందిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయం లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తపడుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పవర్ ఫుల్ కథ సిద్ధం చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా కథ గురించి చిన్న క్లూ ఇచ్చారు.

మరో సంచలనానికి సిద్ధం

మరో సంచలనానికి సిద్ధం

బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాని రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లారు. రాజమౌళి దృశ్యకావ్యంగా తెరకెక్కించిన బాహుబలి సిరీస్ కు దేశం మొత్తం ఫిదా అయింది. బాహుబలి తరువాత రాజమౌళి మరో భారీ ప్రాజెక్ట్‌ని చేపట్టారు. రాంచరణ్, ఎన్టీఆర్ కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. రాజమౌళి మరో సంచలనానికి తెర తీశారంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఎన్నో కథలు

ఎన్నో కథలు

ఈ చిత్రం ప్రారంభం కాక ముందు నుంచే కథ విషయంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది అంటూ, స్వాతంత్ర సమరానికి సంబందించిన కథ అంటూ ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బందిపోటుగా, రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీసుగా నటిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ రాజమౌళి మాత్రం కథ గురించి చిన్న విషయాన్ని కూడా వెల్లడించలేదు.

చాలా బావుంటుంది

చాలా బావుంటుంది

తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ కథ గురించి స్పందించారు. ఈ చిత్ర కథ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఏది నిజం అనే ప్రశ్నకు స్పందిస్తూ.. కథలో ఆ అంశాలన్నీ ఎక్కడో ఓ చోట కలుస్తాయి అని అన్నారు. బాహుబలి తరువాత రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించగా చాలా బావుంటుంది అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. బాహుబలిలా రెండు భాగాలుగా తీసే ఆలోచన ఉందా అని అడిగితే.. అలాంటిది ఏమీ లేదని అన్నారు.

ఆ రోజు ప్రకటిస్తారా

ఆ రోజు ప్రకటిస్తారా

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి ఈ ఏడాది 11 వ నెల, 11 వతేది, 11 గంటలకు ఆసక్తికరమైన సమయంలో ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్ ని 12వ నెల, 12వ తేదీ, 12 గంటలకు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఆరోజు టైటిల్ ప్రకటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ కి తగ్గట్లుగా రామ రావణ రాజ్యం అనే టైటిల్ ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X