రాజమౌళి తండ్రికి సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్?

By Bojja Kumar

vijayendra prasad
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దక్షిణాదిన హిట్టయిన చిత్రాలనే రీమేక్ చేసుకుంటూ వెలుతూ వరుస సక్సెస్‌‌లు సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్.....ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పిన స్టోరీని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇదొక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా అని సమాచారం. త్వరలో ఈ విషయమై సల్మాన్ ఖాన్ వైపు నుండి అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

విజయేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు అనేక చిత్రాలకు కథలు అందించారు. జానకి రాముడు, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సమర సింహా రెడ్డి, సింహద్రి, సై, విజయేంద్రవర్మ, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మిత్రుడు, మగధీర చిత్రాలకు ఆయన కథ అందించడంతో పాటు కొన్ని చిత్రాలకు మాటలు, స్క్రీన్ ప్లే కూడా రాసారు.

రచయితగానే కాకుండా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. 1996లో వచ్చిన అర్ధాంగి, 2006లో వచ్చిన శ్రీకృష్ణ, 2011లో వచ్చిన రాజన్న చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న విజయేంద్రప్రసాద్ తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కోసం ఆయన కథ రాయడాన్ని బట్టి.....ఇతర సినీ పరిశ్రమల్లోనూ తన మార్కు చాటు కోవాలని విజయేంద్ర ప్రసాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సల్మాన్ ఖాన్ కోసం విజయేంద్రప్రసాద్ అందించి స్టోరీ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X