twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కోడికి సంతాపం తెలుపనున్న మెగాస్టార్ అల్లుడు.. విజేత ఆడియో లాంచ్ ఎప్పుడంటే!

    |

    మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం విజేత. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో హీరో కావడంతో విజేత చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాళవిక నాయర్ ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

    శుక్రవారం రోజు ఈ చిత్రంలోని తొలి సాంగ్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసింది. కళ్యాణ్ దేవ్ కోడికి సంతాపం తెలియజేయనున్నాడు. కామెడీగా అనిపిస్తున్నా ఇది నిజం. దానికి సంబందించిన పాటె రేపు విడుదల కాబోతోంది.

    Vijetha movie audio launch date confirmed

    కోడికి సంతాపం తెలియజేసే ఫన్నీ సాంగ్ రేపు విడుదల కాబోతోంది. అదేసమయంలో ఆడియో వేడుక తేదీ కూడా ఖరారు చేశారు. ఈ నెల 24 న విజేత చిత్ర ఆడియో వేడుక జరగనుంది. అయితే ఆడియో లాంచ్ కు వచ్చే ముఖ్య అతిథి ఎవరనే విషయం మాత్రం చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

    English summary
    Vijetha movie audio launch date confirmed. First single will release tomorrow
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X