నపుంసకున్ని చేయాలి, వారి పెళ్లాలది కూడా ఎక్స్‌ఫోజింగే..!
హైదరాబాద్ : ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై ప్రముఖ నటి విజయ నిర్మల(హీరో మహేష్ బాబు సవతి తల్లి) తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మూవీ ఆర్టిస్టున్న అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తల ప్రదర్శనలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ....రేప్ చేసిన వారిని నపుంసకులను చేయాలని డిమాండ్ చేసారు. అలాంటి కఠినమైన శిక్షలు అమలు చేసినప్పుడే ఇంకెవరైనా అలాంటి ఘాతుకాలు చేయడానికి భయ పడతారని, అత్యాచారాలు లాంటి దుస్సంఘటలను అరికట్టడానికి అదే సరైన మార్గమని విజయ నిర్మల అభిప్రాయ పడ్డారు. మరణ శిక్ష వేస్తే నిందితులు హాయిగా చనిపోతారని....అలా కాకుండా వారిని నపుంసకులను చేసి చిత్రహింసలు పెట్టాలని ఆమెవ్యాఖ్యానించారు.
మరో నటి హేమ మాట్లాడుతూ....'మహిళలు కురచ దుస్తులు వేసు కోవడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. అది సరైది కాదు. 60 ఏళ్ల వృద్ధులపై, రెండేళ్ల చిన్నారులపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లేమైనా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారా? అలా మాట్లాడే పెద్ద మనుషుల పెళ్లాలు, పిల్లలు ఎక్స్ ఫోజింగ్ చేసే దుస్తులు వేయడం లేదా?' అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు.
నటి జమున మాట్లాడుతూ....ఢిల్లీ గ్యాంగ్ రేప్ లాంటి సంఘటనలపై దేశ వ్యాప్తంగా యువత కదంతొక్కి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందించ దగ్గ విషయమని, ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కాలం యువత పబ్బులు, తాగుడు లాంటి దురలవాట్లకు బానిసై పెడదారి పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. నటుడు నరేష్ మాట్లాడుతూ...ఈ జనరేషన్ పెడదారి పట్టడానికి ఇప్పటి కాలంలో వచ్చిన అనేక మార్పులే కారణమన్నారు.


Click it and Unblock the Notifications












