twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ ప్రక్క సూపర్ హిట్ టాక్...ఇంకో ప్రక్క కాపీ గొడవ

    By Srikanya
    |

    హైదరాబాద్: ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే అందరి దృష్టీ ఆ సినిమాపైనే ఉంటుంది. అందులో కథ ఏమిటి..దాన్ని ఎక్కడ నుంచి ఎత్తుకొచ్చారు వంటి విషయాలు హైలెట్ అవటం మొదలవుతాయి. తాజాగా బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న క్వీన్ చిత్రానికి ఆ సమస్య ఎదురయ్యింది. ఈ చిత్రం ఫిర్ జిందగీ అనే చిత్రం మక్కికీ మక్కీ కాపీ కొట్టి తీసారని ఫిల్ జిందగీ దర్శకుడు ఆరోపిస్తూ మీడియాకు ఎక్కటంతో వివాదం మొదలైంది. ఈ చిత్రాన్ని క్వీన్ దర్శకుడుకి తానే గతంలో తన చిత్రం స్వయంగా చూపించానని, అప్పుడు ఆయన భార్య కూడా ఉందని,ఆవిడికి బాగా మెచ్చుకున్నారని అంటున్నారు.

    తన కథని మాత్రమే కాక చాలా సీక్వెన్స్ లు సైతం క్వీన్ చిత్రం దర్శక,నిర్మాతలు తీసుకున్నారని ఫిర్ జిందగీ దర్శకుడు అంటున్నారు. ఆయన మాట్లాడుతూ..." హీరో తిరిగి...చివర్లో తన హీరోయిన్ వద్దకు వచ్చే సన్నివేశం, అప్పటికే ఆమె మారిపోయి ఉండటం, కాపీ షాప్ సీన్, ఇంకా చాలా కీలకమైన సన్నివేశాలు ఉన్నదున్నట్లు కాపీ కొట్టారు ," అంటూ కోపంగా చెప్తున్నారు. క్వీన్ దర్శకుడు తమ సినిమా చూడకపోయి ఉంటే...ఖచ్చితంగా సిమిలర్ థాట్ అని సరిపెట్టుకుందమని బాధతో అన్నారు.

    Vikas Bahl’s Queen A Copy Of Phir Zindagi?

    మిలింద్ సోమన్, గుల్ పనాంగ్ కాంబినేషన్ లో వచ్చిన ఫిర్ జిందగీ చిత్రం కథ ఎగ్జాట్ గా క్వీన్ చిత్రంలో మనం చూసిందే. అయితే ట్రీట్ మెంట్ వేరేగా ఉంటుంది. ఆ సినిమాలో కూడా ఓ అమ్మాయి ఒంటిరిగా హానిమూన్ కి బయిలుదేరి అక్కడ నుంచి జీవితం తెలుసుకుంటుంది. అయితే కాస్టింగ్,ప్రమోషన్, స్క్రీన్ ప్లే వంటి అంశాలు క్వీన్ కి ప్లస్ గా నిలిస్తే...ఫిల్ జిందగీ కి అదే మైనస్ గా నిలిచాయి.

    క్వీన్ చిత్రంలో కథ విషయానికి వస్తే.. రాణి(కంగనా) కి విజయ్(రాజ్ కుమార్) కి నిశ్చితార్దం అవుతుంది. తెల్లారితే వివాహం అనగా..విజయ్ ..రాణిని పిల్చి,నీకు నాకు కలవదు...ఈ పెళ్లి వద్దు అని చెప్తాడు. దాంతో రాణి డిప్రెషన్ లోకి వెళ్తుంది. ఆమె పెళ్ళి అయితే వెళ్లే హానిమూన్ కోసం టిక్కెట్స్ కూడా బుక్ చేసుకుంటుంది. దాంతో ఆమె ఒక్కర్తే హానిమూన్ కి ప్యారిస్ వెళ్తుంది. అక్కడ ఆమెకు అయ్యే పరిచయాలు, అక్కడి మనుష్యులతో ఆమె జీవితం ఎలా మారుతుంది అనేది కథ.

    English summary
    Vikas Bhal’s Queen is apparently a COPY of Abhigyan Jha’s Phir Zindagi, well that’s what Abhigyan has to say. On one hand Abhigyan accepts that the treatment of Queen is very different from his film but on the other feels that the story line of Queen is more or less the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X