‘శంకరాభరణం’ 14 సార్లు చూశానంటున్న మెగా హీరో

By Srikanya

చదువుకునే రోజుల్లో 'శంకరాభరణం" 14 సార్లు చూశాను.కె.విశ్వనాథ్ గారితో పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది అంటన్నారు తమిళ మెగా హీరో విక్రమ్. ఆయన తాజా చిత్రం 'రాజాబాట్టై" చిత్రం 'వీడింతే"..బై బర్త్ ట్యాగ్ లైన్ తో తెలుగులో విడుదల అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రం గురించి చెపుతూ...మొదటనుంచీ వైవిధ్యం కోసం ప్రయత్నించడం నాకు అలవాటు. కానీ ఈసారి కమర్షియల్‌గా ట్రై చేయాలనిపించింది. ఆ నిర్ణయాన్నే దర్శకుడు సుశీంద్రన్‌కి చెప్పాను. అన్ని రకాల ఐటమ్స్ ఉన్న విందు భోజనం లాంటి సినిమా ఇది. ఇందులో జిమ్‌బోయ్ లాంటి పాత్ర చేశాను. నటనకు చాలా అవకాశం ఉన్న పాత్ర ఇది. విభిన్నమైన గెటప్స్, విచిత్రమైన కేరెక్టరైజేషన్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలుస్తాయి. దీక్షాసేథ్ కెరీర్‌కి ఈ సినిమా మైలురాయిలా నిలుస్తుంది అన్నారు.

ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రోమోలను, టీజర్స్ ను హైదరాబాద్‌లో ఎం.ఎం.కీరవాణి ఈ సినిమా ప్రచార చిత్రాలను, డి.సురేష్‌బాబు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విక్రమ్ పై విధంగా మాట్లాడారు. ఇక కె. విశ్వనాధ్ మాట్లాడుతూ..''ఈ సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభవం. ఎమోషన్ వైజ్, యాక్షన్ వైజ్ కొత్తగా ఉంటుందీ సినిమా"" అని చెప్పారు. కమల్‌ హాసన్ తర్వాత విభిన్నతకు మరో రూపం విక్రమ్ అని కీరవాణి అన్నారు. ఈ చిత్రంలో విక్రమ్ పద్నాలుగు వెరైటీ గెటప్స్ లో కనపిస్తారు. అలాగే ఈ చిత్రం డిసెంబర్ 16న తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. శ్రీయ, రీమాసేన్, సలోని, ప్రదీప్‌రావత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్‌ రాజా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X