విక్రమ్-అనుష్క ‘శివ తాండవం’
విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న తమిళ చిత్రం 'తాండవం'. ఈ చిత్రానికి తెలుగులో 'శివ తాండవం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. యు.టి. వి.మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రోనీ స్ర్కూవాలా, సిద్ధార్థరాయ్‌కపూర్ నిర్మాతలు. అనుష్క, లక్ష్మీరాయ్, ఎమీజాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నాడు.
ఈ మధ్యనే ఈ చిత్రం చిత్రీకరణ చెన్నైలో ముగించుకుంది. జూలై 13న ఈ చిత్ర తెలుగు వెర్షన్ ఆవిష్కరిస్తారని యూటివి దక్షణ హెడ్ ధనంజయ్ గౌడ్ చెప్పారు. విక్రమ్,జగపతి బాబు , ఏమి జాక్సన్, లక్ష్మి రాయి మరియు ఏ ఎల్ విజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఇందులో విక్రమ్ పూర్తి వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. జగపతిబాబు పాత్ర సినిమాకు ప్రత్యేకార్షణగా నిలుస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. జి.విపకాష్‌కుమార్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో చిత్రానికి సంబంధించిన నిర్మాణ కార్యక్షికమాలు జరుగుతున్నాయి' అన్నారు.
షాయాజీ షిండే, నాజర్, కోట శ్రీనివాసరావు, శంతనమ్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సెప్టెంబర్ 18న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌కి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











