'మనోహరుడు' లో విక్రమ్ స్పెషల్ గెటప్స్ ఇవే

హైదరాబాద్ : విక్రమ్ ఏ చిత్రం చేసినా ఏదో ఒక విభిన్నత ఉండాలని కోరుకుంటున్నారు. తాజాగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మనోహరుడు' చిత్రంలోనూ ఆయన విభిన్నమైన గెటప్స్ తో ప్రయోగాలు చేసి అభిమానులను అలరించాలనుకుంటున్నారు.

ఈ సినిమాలో విక్రమ్‌ కొన్ని ప్రయోగాలు చేశారు. పదిహేనేళ్ల బాలుడిగానూ, 85యేళ్ల వృద్ధుడిగానూ కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన తన దేహశైలిని కూడా మార్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన కసరత్తులు చేశారు.

విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూరులో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. విజయ్‌ మాల్యాకి చెందిన అశ్వశాలలో చిత్రీకరణ సాగుతోంది. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణాన్ని, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాది చివరల్లో సినిమా విడుదలవుతుంది.

హాలీవుడ్‌ చిత్రం 'లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌'కి పని చేసిన సాంకేతిక నిపుణుల ఆధ్వరంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కార్యక్రమాలు వచ్చే నెలలో మొదలవుతాయి. విక్రమ్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం శంకర్ దర్శకుడుగా రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే.

ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఐ' . ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు.

ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న 'ఐ' చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ 'ఐ' చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందిప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X