బాలా నెక్ట్ చిత్రం కి స్టార్ హీరో ఖరారు
ఇక విక్రమ్ ప్రస్తుతం మనోహరుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక్కడ ఓ పాట,కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఇరవై రోజులు షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది.
శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ లీక్ అయ్యిందంటూ చెన్నై ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది.
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.


Click it and Unblock the Notifications












