ఆ హీరోయిన్‌తో సంబంధం లేదంటున్న దర్శకుడు
కాలం కర్మం కలిసిరాక ఇద్దరూ విడిపోయారు. అమీషా 'పర్సనల్' లైఫ్‌ని అతి సన్నిహితంగా చూసిన విక్రమ్ భట్.. ఆమె కథని 'రాజ్-3' ద్వారా తెరకెక్కించనున్నాడన్న వార్తలు వినిపించాయి. నటి జీవితం అంటేనే సంద్రంలో కొట్టుకుపోయే నావ. ఎన్నో వొడిదుడుకులు.. ఎన్నెన్నో సమస్యలు - వాటిల్లో పుట్టే ఫ్రస్ట్రేషన్. మానసిక వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు. వీటన్నింటి ప్రతిబింబమే ఈ చిత్రం.
తాజాగా విక్రమ్ భట్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ... ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఒక అందాల బొమ్మ ఏయే కారణాలరీత్యా ఎదిగిందీ? ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నదీ - ఇలా ప్రతి అంశాన్నీ తెరకెక్కించే ప్రయత్నం చేశామంటున్నాడు విక్రమ్‌భట్. కానీ అమీషా పటేల్ జీవితంలోంచి పుట్టిన కథ కాదంటూ ఒక కొసమెరుపు విసిరాడు.
అదే విధంగా అమీషాకు తనకు మధ్య ఉన్న బంధం కేవలం స్నేహ బంధం మాత్రమే. మేము ప్రేమించుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె గతంలో వాళ్ల పేరెంట్స్‌తో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నన్నొక మంచి స్నేహితుడిగా భావించి నా వద్ద ఆశ్రయం పొందింది. కష్టాల్లో ఉన్న ఆమెకు ఓదార్పును మాత్రమే పంచాను. అంతుకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదు. మేము పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తలు అర్థరహితమని స్పష్టం చేసాడు.


Click it and Unblock the Notifications












