విక్రమ్ భట్ ' హేట్ స్టోరీ' కథేంటి?

By Srikanya

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ మరో సారి హాట్ సబ్జెక్టుతో 'హేట్ స్టోరీ' అనే టైటిల్ తో ముందుకొస్తున్నారు. ఈ నెల 20న భారీగా రిలీజవుతున్న ఈ చిత్రం ఓ సస్పెన్స్ ధ్రిల్లర్ అంటున్నారు. ముఖ్యంగా చిత్రం పగ,ప్రతీకారాలకు చెందిందని ఆయన వివరిస్తున్నారు. నిఖిల్‌ద్వివేది, పవోలిడామ్, గుల్షన్‌దేవయ్య ప్రధాన పాత్రధారులుగా బీవీజీ ఫిలింస్ పతాకంపై వివేక్‌అగ్నిహోత్రి దర్శకత్వంలో వివేక్‌భట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 20న వైష్ణవి మల్టీమీడియావారు ఆంధ్రప్రదేశ్, మరట్వాడాలో ఈ చిత్రాన్ని 100 థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం కథ ప్రకారం... సిన్సియర్ జర్నలిస్ట్‌గా చేసే కావ్య ఓ సిమెంట్ కంపెనీ అవకతవకలను బయటపెడుతుంది. ఆమెపై పగబట్టిన సదరు కంపెనీ యజమాని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తాడు. గత్యంతరం లేని పరిస్థితిలో కావ్య వేశ్యగా మారుతుంది. ఈ కారణంగా ఆమె కుటుంబం, రహస్యంగా ఆమెను ప్రేమిస్తున్న విక్కీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. తనను నీచస్థితికి దిగజార్చిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి కావ్య సిద్ధపడుతుంది. తన పగను తీర్చుకోవడానికి కావ్య ఏం చేస్తుంది? అనుకున్నది సాధించగలుగుతుందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'హేట్ స్టోరి'.

ఇక ఈ చిత్రం పోస్టర్స్ పై... ''ప్రేమ ఆమె ఆత్మను చంపేసింది. ఇక, మిగిలింది పగ మాత్రమే. ఆమె శరీరం ప్రతీకారం తీర్చుకోవాలని ఆరాటపడుతుంది''అంటూ వేసారు. అంటే ఈ చిత్రం పగ, ప్రతీకారాలకు సంబంధించిన సినిమా కథ అని చెప్పేసి ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తున్నారు.బీవీజీ ఫిల్మ్స్ పతాకంపై విక్రమ్ భట్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'హేట్ స్టోరీ'. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత విక్రమ్ భట్ మాట్లాడుతూ..."కావ్య మధ్యతరగతి అమ్మాయి. జర్నలిస్ట్ నుంచి సెక్స్ వర్కర్‌గా ఎలా మారింది? వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను దోచుకున్నది ఎవరు? వారికి ఆమె ఎలా బుద్ధి చెప్పింది? అనేది కథ. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు. అలాగే కావ్య పాత్రలో పవోలీడామ్ అద్భుతంగా నటించిందని, బెంగాలీ భాషలో మంచి నాయికగా పేరు తెచ్చుకున్న ఆమె హిందీలో నటించిన తొలి చిత్రం ఇది అని, ఈ చిత్రం బాలీవుడ్‌లో పవోలీకి మంచి బ్రేక్ అవుతుందని నిర్మాత విక్రమ్‌భట్ పేర్కొన్నారు.నిఖిల్ ద్వివేది, గుల్షన్ దేవయ్య, పవోలి దామ్ కీలక పాత్రధారులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X