1920 హర్రర్ సినిమా...

By Staff
Vikram Bhatt
బాలీవుడ్ వరస ఫ్లాఫుల దర్శకుడు విక్రమ్ భట్ ఈ సారి తన బాణీ మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు.దాదాపు అంతా కొత్త వారితో 1920 పేరుతో ఓ పీరియడ్ హర్రర్ మూవీని ఈయన రూపొందిస్తున్నాడు. 1920 లో జరిగే ఈ సినిమా ఓ ప్రేమ కథగా ఉంటూనే వెన్నులో వణుకు పుట్టించేలా భయపెడుతుందని హామీ ఇస్తున్నాడు. అంతేగాక ఓ ఇండియన్ అబ్బాయికి,ఆంగ్ల వనితకు జరిగే లవ్ స్టోరీగా దీన్ని తీర్చిదిద్దానంటున్నాడు. రాజస్ధాన్,ముస్సోరి,ముంబాయి,హిమాలయాలలోని ప్రముఖ ప్రాంతాలలో ఈ సినిమా చిత్రీకరణ చేసాడుట. పెద్దలు ఒప్పుకోని ఈ ప్రేమికుల జంటకు కొన్ని సూపర్ నేచురల్ పవర్స్ వల్ల అడ్డంకులు ఎదురవటం ఈ చిత్రంలోని కీలకాంశం అంటున్నారు.నిర్మాత సురేంద్ర శర్మ ఈ సినిమాను క్లాసిక్ పీరియడ్ గా అభివర్ణిస్తున్నాడు.ఇక ఆద్నామ్ సామి సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X