‘ఐ’(మనోహరుడు) స్టోరీలైన్ లీక్ చేసిన విక్రమ్

By Bojja Kumar

హైదరాబాద్: భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ దర్శకుడు శంకర్ రూ. 180 కోట్ల బడ్జెట్‌తో చియాన్ విక్రమ్ హీరోగా తమిళంలో ‘ఐ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. అసలు ఈ సినిమా కాన్సెప్టు ఏమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు. ఫస్ట్ లుక్ కూడా డిఫరెంటుగా ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ ఖర్చు చేయించిన శంకర్ తెరపై ఏం అద్భుతం ఆవిష్కరించబోతున్నారనే విషయం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఐ' సినిమాలో మూడు గెటప్స్ లో కనపడతాను. సినిమా మోడలింగ్ ఫీల్డ్ కి సంబంధించిన పాయింటతో రూపొందింది. మోడలింగ్ రంగంలోకి వచ్చిన ఓ వ్యక్తి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడనేదే కోణంలో సినిమా ఉంటుంది. శంకర్ స్టయిల్ లో సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ కి ఫీలవుతారు అన్నారు.

 Vikram to don 3 new getups for Manoharudu

ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి.బ్యానర్లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ కలిసి ‘మనోహరుడు'గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ‘ఐ' చిత్రానికి సంబంధించిన ఆడియో ఫంక్షన్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగబోతోంది.

భారీగా సీని అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో దాదాపు ఏడెకరాల విస్తర్ణం ఉండే నెహ్రూ స్టేడియాన్ని ఆడియో వేడుకగా ఎంచుకున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కి హాలీవుడ్ సూపర్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగెర్, సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. వందేళ్ల భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో 20,000 థియేటర్లలో ఈ చిత్రం విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X