అవార్డులు రావాలని సినిమాలు చేయను..కానీ నాపాత్రలకు అవార్డులు వస్తున్నాయి..!?
ఇక కావ్యాలు, ఇతిహాసాల స్ఫూర్తితో చాలా కథలు సిద్ధమవుతుంటాయి. కానీ 'రావణ్' ఇతిహాసం కాదు. కాకపోతే ప్రధాన పాత్ర రాముడిని పోలి ఉంటుంది. ఈ పాత్రను మణిరత్నం చాలా వినూత్నంగా తీర్చిదిద్దారు. సినిమా చూసిన వారికి మణిరత్నం చేసిన ప్రయోగం కనిపిస్తుందని విక్రమ్ తెలిపారు. తమిళం తెలియని బాలీవుడ్ జనాలు సైతం తను నటించిన తమిళ చిత్రాల గురించి ప్రస్తావిస్తుంటే ఆనందంగా అనిపించిందని ఆయన చెప్పారు. అలాగే ఒకే కథ..రెండు భాషలు..ఒక భాషలో హీరో. మరో భాషలో విలన్. ఇలా నటించే అవకాశం బహుశా ప్రపంచంలోనే ఏ నటుడికీ రాలేదేమో. అంతటి అదృష్టం వరించనందుకు ఆనందంగా ఉంది అంటున్నారు విక్రమ్.
రావణ్' అనుభవాలను మీడియాతో పంచుకుంటూ...ఒక భాషలో హీరోగా, మరో భాషలో విలన్‌గా వెంట వెంటనే చేయాల్సి వచ్చేది. మామూలుగా అయితే మేకప్ ను తొలగించుకోవడానికి కూడా గంటల సమయం పట్టేది. కానీ ఈ సినిమాకు రెట్టింపు ఉత్సాహంతో పని చేశాను. పది నిమిషాల్లో మేకప్ పనులన్నీ పూర్తి చేసుకునేవాణ్ని అన్నారు. ఇక ఈ సినిమా తెలుగులో 'విలన్' గా అనువాదమవుతోంది. ఈ రెండు వెర్షన్ ఫైనల్ అవుట్ పుట్ చూసిన విక్రమ్ తనకు నేషనల్ అవార్డు గ్యారంటీ అని అనుకుంటున్నాడట. దీని గురించి విక్రమ్ మాట్లాడుతూ 'నేను అవార్డులు రావాలని సినిమాలు చేయను. కానీ నేను చేసే పాత్రలకు అవార్డులు వస్తున్నాయి. ఇప్పుడు 'రావణ్" సినిమాకి కూడా నాకు నేషనల్ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది" అని చెప్పాడు.
హిందీ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం జూన్ 18న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియోను సోనీ మ్యూజిక్ వారు తీసుకున్నారు. ఎఆర్ రహమాన్ ఈ చిత్రానకి సంగీతం అందించారు. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, అబిషేక్ బచ్చన్ కీ రోల్స్ చేసారు. తెలుగు, తమిళ వెర్షన్ లలో విక్రమ్ హీరోగా, పృధ్వీరాజ్ విలన్ గా కనిపిస్తారు. అయితే హిందీకి విక్రమ్ విలన్ గానూ అబిషేక్ బచ్చన్ హీరోగానూ కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











