వామ్మో...బాగా ఎక్కువ: విక్రమ్ 'ఐ' రన్ టైం
హైదరాబాద్: యావత్ సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఐ' చిత్రం సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఐ' సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలు(188 నిమిషాలు) అని సమాచారం. ప్రస్తుతం ఈ రన్ టైం ఉన్న సినిమాని సెన్సార్ కి పంపుతున్నట్లు తెలిసిందే. సెన్సార్ పూర్తైన తర్వాత ఇందులో ఒక 8 నిమిషాలు కట్ చేసి టోటల్ గా 3 గంటల సినిమాని రిలీజ్ చేసేలా ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంత ఎక్కువ రన్ టైం...ఎంతో పకడ్బందీ స్క్రీన్ ప్లే ఉంటే తప్ప ఒప్పించటం కష్టమే.
ఈ చిత్రంలో విక్రమ్ ఈ చిత్రంలో భిన్న పాత్రల్లో కన్పించనున్నారు. ఓ వైపు బాడీబిల్డర్ లింగేశ్వర్ పాత్ర కోసం బరువు పెరిగి... మళ్లీ గూనివాడి పాత్ర కోసం పూర్తిగా తగ్గారు. సైకిల్ హీరోయిన్‌గా మారడం, నోకియా ఫోన్ డ్రెస్‌లో కధానాయికను చూపించడం వంటి శంకర్ మార్క్ మాయాజాలం ఈ చిత్రంలోనూ చూడవచ్చు. ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలిమ్స్ పతాకంపై ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించగా తెలుగులో మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ విడుదల చేస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అమీజాక్సన్ హీరోయిన్.
ఈ నెల 14న ఆస్కార్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు లభిస్తున్న స్పందన పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''శంకర్ ప్రదర్శించనున్న మరో మాయాజాలం 'ఐ'. విక్రమ్ నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల ఎక్కడకి వెళ్లినా ఈ చిత్రంలోని గీతాలే వినిపిస్తున్నాయి.

చేతి వేళ్లకు పూలు పూయడం, ఒంటిపై సీతాకోక చిలుకలు వాలడం, ప్రపంచ వింతలను ఒకే పాటలో చూపించడం ఇవన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే సినీ పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా టక్కున చెప్పేది శంకర్ సినిమాలో అని. అందుకు తగినట్లే ఆయన సినిమాలు ఉంటాయి.
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.
విక్రమ్ గెటప్‌లు, అమీజాక్సన్ అందచందాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ''ని తెలిపాయి చిత్రవర్గాలు. సురేష్‌గోపి, ఉపేన్‌పటేల్, సంతానం, రాంకుమార్ గణేషన్, శ్రీనివాసన్, సయ్యద్ సిద్ధిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరామ్, కూర్పు: ఆంటోని, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్.


Click it and Unblock the Notifications











