నా స్థితి చూసి అమ్మ బాధ పడింది: విక్రమ్

By Bojja Kumar

హైదరాబాద్: చియాన్ విక్రమ్ నటించిన ‘ఐ' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏ హీరో చేయని సాహసం చేసాడు విక్రమ్. సినిమాలోని పాత్రలో వేరియేషన్స్ కోసం భారీగా బరువు పెరగడంతో పాటు...భారీగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఆరోగ్యాన్ని పనంగా పెట్టి సినిమా కోసం ఇంతలా కష్టపడ్డ వ్యక్తి భారతీయ సినీ చరిత్రలో మరొకరు ఉండరేమో.

సినిమా విడుదల సందర్భంగా విక్రమ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ...ఈ పండగకు ‘ఐ' చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేసాడు. ప్రముఖ దర్శకుడు శంకర్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కలిస్తే ఎలాంటి అద్భుతం ఆవిష్కారమవుతుందో చెప్పడానికి ‘ఐ' చిత్రమే నిదర్శనమని తెలిపారు. ముఖ్యంగా సినిమాలో చైనాలో చిత్రీకరించిన సీన్లు పిసి శ్రీరామ్ ప్రతిభను తెలియజేస్తాయని తెలిపారు.

Vikram interview about 'I'

పాత్ర కోసం ఎంత కష్టపడ్డానో నేను మాటల్లో చెప్పలేదను. 130 కేజీల బరువు పెరగడం కోసం అహర్నిశలు శ్రమించాను. అయితే ఆ కష్టం నన్ను నేను తెరపై చూసుకున్నపుడు మరిచిపోతాను. అయితే సినిమాలో సన్నబడిన పాత్ర కోసం ఏకంగా 30 కిలోల వరకు బరువు తగ్గాను. నటన కోసం అలా చేయడం నాలో మరింత ఆసక్తిని పెంచింది. అయితే సన్నబడ్డ సమయంలో నా పరిస్థితి చూసి అమ్మ చాలా బాధ పడింది. ఆమెకు సర్ది చెప్పడం చాలా కష్టమయిందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ రియాల్టీ కోసమే బరువు విషయంలో ఇంత కష్టపడటాల్సి వచ్చింది..అదో థ్రిల్ అని చెప్పుకొచ్చారు విక్రమ్. నా వల్ల అయినంత వరకు కష్ట పడ్డాను. జాతీయ అవార్డు వస్తుందా లేదా? అనేది ఆ భగవంతుడి చేతులో ఉంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X