ముందు త్రివిక్రమ్, వెనక విక్రమ్: ఎన్టీఆర్ ప్లాన్ భలే ఉంది

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు ఓకే చెప్పాడ‌ని టాలీవుడ్ టాక్‌. ఒకపక్క త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే విక్రమ్ తో ఇంకో ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టేసాడ

Recommended Video

ముందు త్రివిక్రమ్.. వెనక విక్రమ్.. ఎన్టీఆర్ ప్లానే..ప్లాన్

ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ 25 వ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు త్రివిక్ర‌మ్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ 'జై లవ కుశ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫారిన్ ట్రిప్ లో వున్న ఎన్టీఆర్ .. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఎన్టీఆర్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడు ఎవరో కాదు .. విక్రమ్ కుమార్.

ఎన్టీఆర్ మ‌రో ప్రాజెక్టు

ఎన్టీఆర్ మ‌రో ప్రాజెక్టు

ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ సినిమా త‌ర్వాత వెంట‌నే ఎన్టీఆర్ మ‌రో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. 'మ‌నం' ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు ఓకే చెప్పాడ‌ని టాలీవుడ్ టాక్‌. ఒకపక్క త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కకముందే విక్రమ్ తో ఇంకో ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టేసాడు జూనియర్.

 విక్ర‌మ్ కె.కుమార్‌

విక్ర‌మ్ కె.కుమార్‌

'ఇష్క్‌', 'మ‌నం', '24' వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను రూపొందించిన విక్ర‌మ్ కె.కుమార్‌.. ప్ర‌స్తుతం అక్కినేని అఖిల్‌తో 'హ‌లో' సినిమాని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 22న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌రువాత అల్లు అర్జున్‌, నానితో విక్ర‌మ్ త‌దుప‌రి చిత్రాలు ఉంటాయ‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి.

ఎపుడూ చేయ‌ని పాత్ర‌

ఎపుడూ చేయ‌ని పాత్ర‌

అంతేకాకుండా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌తోనూ విక్ర‌మ్ ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ కొత్త వార్త వచ్చింది. విక్ర‌మ్ ఈ మధ్య యంగ్ టైగర్‌కి బాగా నచ్చిందట, ఆ క‌థ వినూత్నంగా ఉండ‌డంతో విక్ర‌మ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఎన్టీఆర్ ఇంత‌కుముందు ఎపుడూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌నీ. రొటీన్ క‌థ‌ల‌కు భిన్నంగా ఆ సినిమాను తెర‌కెక్కించాల‌ని విక్ర‌మ్ భావిస్తున్నాడ‌న్నది లేటెస్ట్ టాక్.

మొదట బన్నీతో చేసే ప్రాజెక్ట్

మొదట బన్నీతో చేసే ప్రాజెక్ట్

ప్రస్తుతం అఖిల్ తో విక్రమ్ కుమార్ 'హలో' మూవీ చేస్తున్నాడు. అలాగే విక్రమ్ కుమార్ తో సినిమా సినిమా చేయడానికి అటు అల్లు అర్జున్ కూడా సిద్ధంగా ఉన్నాడు. సో మొదట బన్నీతో చేసే ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసాకే జూనియర్ దగ్గరికి వస్తాడన్న మాట ఈ 24 దర్శకుడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X