విక్రమ్ కుమార్‌తో నాని.. అలాంటి కథ నాని చేస్తాడా!
న్యాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణార్జున యుద్ధం చిత్రం ఇటీవల విడుదలై నిరాశపరిచింది. ఎనిమిది వరుస విజయాల తరువాత నాని నుంచి వచ్చిన నిరాశాజనకమైన చిత్రం ఇది. ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. నాని మరో చిత్రానికి సంబందించిన వార్తలు కూడా వస్తున్నాయి.
భిన్నమైన చిత్రాలని తెరకెక్కించడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ శైలి వేరు. మనం వంటి క్లాసికల్ చిత్రాన్ని ఆయన తెలుగు వారికి అందించారు. ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన హలో చిత్రం నిరాశపరిచింది. దీనితో ఈ సారి పక్క స్క్రిప్ట్ రూపొందించుకుని హిట్ కొట్టాలని విక్రమ్ కుమార్ భావిస్తున్నాడు.

తాజగా అందుతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రాతం విక్రమ్ కుమార్ తదుపరి చిత్రం నానితో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఓ థ్రిల్లర్ కథని విక్రమ్ కుమార్ నాని కోసం రూపొందించాడని, నానికి కూడా విక్రమ్ చెప్పిన కథకు సూచనప్రాయంగా ఒకే అన్నారని వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తయ్యాక ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











