నాని అలాంటి పనులు కూడా చేస్తాడా.. రూమర్స్‌ని కొట్టిపారేసిన దర్శకుడు!
నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో జోరుమీదున్నాడు. గత ఏడాది వరకు డబుల్ హ్యాట్రిక్ విజయాలతో అలరించిన నానికి ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రూపంలో పరాజయాలు ఎదురయ్యాయి. నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు విభిన్న చిత్రాలని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో జెర్సీ చిత్రంలో నాని నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మరోవైపు క్రేజీ దర్శకుడు విక్రమ్ కుమార్ కి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభం కాకముందే అనేక రూమర్స్ ప్రచారం జరుగుతున్నాయి. వాటిపై దర్శకుడు విక్రమ్ కుమార్ స్పందించాడు.

నాని కొత్త అవతారం
ఎలాంటి పాత్రలో అయినా చురుకైన నటనతో మెప్పించడం నాని శైలి. అందుకే నేచురల్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. నాని నటుడిగానే కాదు ఆ మధ్యన అ! అనే చిత్రాన్ని నిర్మాతగా కూడా మారాడు. ఇప్పుడు నాని మరో కొత్త అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విక్రమ్ కుమార్ దర్శత్వంలో తెరకెక్కబోయే చిత్రానికి నాని రచయితగా మారబోతున్నాడట. విక్రమ్ కుమార్ కు నాని రచనలో సాయం అందించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

అలాంటి పనులు కూడా చేస్తాడా
నాని గురించి అభిమానులకు ఇది షాకింగ్ న్యూసే అని చెప్పొచ్చు. నాని ఇలాంటి పనులు కూడా చేస్తాడా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. రూమర్స్ ఎక్కువవుతుండడంతో విక్రమ్ కుమార్ స్పందించారు. నాని నా చిత్రానికి రచయిత కాదు. నాని రచయితగా ఎప్పుడు మారాడో కూడా నాకు తెలియదు. నా చిత్రానికి నాని హీరో మాత్రమే అని తెలిపాడు. జనవరి కల్లా కథ పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

హర్రర్ కథ
విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కథ గురించి మాత్రం విక్రమ్ కుమార్ స్పందించలేదు. ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ ప్రతినాయకుడు పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

ఐదుగురు హీరోయిన్లు
ఈ చిత్రాన్ని ప్రకటించే సమయంలోనే నాని హీరోయిన్ల గురించి హింట్ ఇచ్చాడు. నాతో పాటు ఆ ఐదుగురు కూడా ఉన్నారు అని తెలిపాడు. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ కుమార్ చిత్రాల్లో బలమైన కథ ఉంటుంది. ఇష్క్, మనం, 24 చిత్రాలు అలాంటివే. నాని చిత్రంతో విక్రమ్ కుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











