విక్రమ్ కుమార్‌కు 1.5 కోట్ల ఫైన్.. 'మనం' కంటే ముందే, ఏం జరిగిందంటే!
విభిన్నమైన చిత్రాలతో దర్శకుడు విక్రమ్ కుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 13బి, ఇష్క్ లాంటి హిట్ చిత్రాలని ఈ దర్శకుడు రూపొందించారు. ఇక విక్రమ్ కుమార్ అక్కినేని కుటుంబంతో తెరకెక్కించిన 'మనం' చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచింది. సూర్యతో తెరకెక్కించిన 24 చిత్రం విక్రమ్ కుమార్ ప్రతిభకు అద్దం పడుతుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు చిక్కులో పడ్డాడు. ఫిలిం ఛాంబర్ విక్రమ్ కుమార్ కు 1.5 కోట్ల ఫైన్ విధించిందనే వార్త వైరల్ గా మారుతోంది. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

'మనం' కంటే ముందే
13బి, ఇష్క్ చిత్రాల విజయాలతో గుర్తింపు పొందిన విక్రమ్ కుమార్ ఆ తరువాత క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు. మనం చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. కాగా మనం చిత్రం కంటే ముందే తమ బ్యానర్ లో సినిమా చేయాలని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అడ్వాన్స్ కొంత మొత్తం విక్రమ్ కుమార్ కు ఇచ్చారట. మనం, 24 లాంటి చిత్రాలతో విక్రమ్ కుమార్ స్థాయి పెరిగింది.

ఆగ్రహంతో
అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ విక్రమ్ కుమార్ అన్ని చిత్రాలు వేరే బ్యానర్స్ లోనే చేస్తున్నాడని అశ్విని దత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనితో ఆయన ఫిలిం ఛాంబర్ లో విక్రమ్ కుమార్ పై ఫిర్యాదు చేశారట. దీనిపై విచారణ నిర్వహించిన డైరెక్టర్స్ కౌన్సిల్ విక్రమ్ కుమార్ దే తప్పుగా భావించి అతడికి 1.5 కోట్ల ఫైన్ విధించినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని
అశ్విని దత్ అడ్వాన్స్ రూపంలో ఎంత డబ్బు ఇచ్చారనేది బయటకు రాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల విక్రమ్ కుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్రయత్నించి భంగపడ్డాడు. కథ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించక పోవడంతో విక్రమ్ కుమార్ దర్శత్వంలో నటించే ఆలోచనని బన్నీ విరమించుకున్నాడు. కథలో మార్పులు చేసినా బన్నీ అంగీకరించలేదట.

నానితో అంటూ
అదే కథతో విక్రమ్ కుమార్ నేచురల్ స్టార్ నానిని ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అఖిల్ హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చివరి చిత్రం హలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ చిత్రాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











