అఖిల్ విషయంలో ఆ తప్పు జరుగకూడదనేనా?

By Bojja Kumar

హైదరాబాద్: నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని త్వరలో హీరోగా తెరం గ్రేటం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన 'మనం' చిత్రంలో అఖిల్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడంతో అతని తొలి సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో అఖిల్ లుక్ అదరిపోయే విధంగా ఉండటమే ఇందుకు కారణం.

ఏ హీరోకైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇప్రెషన్. తొలి సినిమా హిట్టయితేనే...ఫ్యూచర్ బాగుంటుంది. లేకుంటే కెరీర్ స్లోగా నడుస్తోంది. నాగార్జున పెద్ద కూమారుడు నాగ చైతన్య నటించిన తొలి చిత్రం 'జోష్' ఆశించిన ఫలితా ఇవ్వకపోవడంతో నాగ చైతన్య కెరీర్ ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. నాగ చైతన్యకి లక్కీగా 'ఏమాయ చేసావే' హిట్ వచ్చింది కాబట్టి క్లిక్ అయ్యాడు.

Vikram Kumar working on a new storyline for Akhil

పెద్ద కుమారుడు నాగ చైతన్య విషయంలో జరిగిన తప్పులు....అఖిల్ విషయంలో జరుగకూడదని నాగార్జున భావిస్తున్నాడు. ఇందుకోసం అఖిల్ తొలి సినిమా కోసం పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జునే నిర్మించబోతున్నారు. అందుకే హిట్ ఇచ్చే సత్తా ఉన్న దర్శకుడితోనే అఖిల్ సినిమా చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవల అక్కినేని ఫ్యామిలీకి 'మనం' చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ అఖిల్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'ఇష్క' చిత్రం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్టెనర్ తెరకెక్కించగల విక్రమ్ కుమార్ అయితేనే అఖిల్ తెరంగ్రేటానికి కరెక్ట్ అని నాగార్జున భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ ప్రస్తుతం అఖిల్‌ని ప్రెజెంట్ చెయ్యడానికి కధని సిద్ధంచేసుకుంటున్నాడు. వచ్చే నెలాఖరికి ఈ కధ సిద్ధమవుతుందని సమాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్ ని యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ మేళవించి కథని రాస్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X