మగాళ్ళే సైట్ కొట్టారు..స్టార్ హీరో

By Staff

Mallanna
ఇందులో నేను వేసింది యువతి వేషం. సెట్స్‌మీద అంతా ఒక మాదిరిగా నావేపు చూసేవాళ్లు. అందరికీ నేను విక్రమ్‌ ననే తెలుసు. కానీ సైట్‌ కొట్టేవాళ్లు అని చెప్పారు విక్రమ్‌. ఆయన తాజాగా 'మల్లన్న'లో సూపర్‌ హీరో పాత్ర చేయడమే కాక తన పాటలన్నీ తనే సొంతంగా పాడారు. సుశీ గణేశన్‌ దర్శకత్వంలో కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భాంగా మీడియాతో ముచ్చటించారు.

తన స్త్రీ వేషం గురించి చెబుతూ...ఎక్కువ కష్టం మాత్రం స్త్రీ వేషంలోనే. అది వేయడానికి మొదట సందేహించా. ఎందుకంటే అంతకుముందన్నీ మాస్‌ పాత్రలతోటే ప్రేక్షకుల ముందుకొచ్చా. వాళ్లెట్లా రిసీవ్‌ చేసుకుంటారనే సందేహం. ఆ పాత్ర చేయడానికి సుశీ నన్ను ప్రోత్సహించాడు. 'దశావతారం'లో కమల్‌హాసన్‌ వృద్ధురాలిగా కనిపించారు. అంతకుముందు 'భామనే సత్యాభామనే'లో మధ్యవయసు మహిళగా చేశారు. కానీ ఇందులో నేను వేసింది యువతి వేషం. సెట్స్‌మీద అంతా ఒక మాదిరిగా నావేపు చూసేవాళ్లు. అందరికీ నేను విక్రమ్‌ననే తెలుసు. కానీ సైట్‌ కొట్టేవాళ్లు.

తెరపై సుమారు 15 నిమిషాలు కనిపించే ఈ వేషాన్ని ఆడవిక్రమ్ మల్లన్న(కందసామి) చిత్రంపైనే ఇప్పుడందరి దృష్టి ఉంది. అందులోనూ చాలా కాలం విక్రమ్ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు. అలాగే ఈ సినిమాలో విక్రమ్ రకరకాల గెటప్ లలో కనపడనున్నారు. ఇక సుశీగణేషన్ దర్శకత్వంలో కలై పులి థాను నిర్మిస్తున్న ఈ చిత్ర కథ కూడా ఢిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ పాత్ర అందరినీ ఆదుకునే రాభిన్ హుడ్ తరహాలో వెళ్తుందని తెలుస్తోంది. అలాగే కథ ప్రకారం జనం తమ కష్టాలని, భాధలని చీటీలపై రాసి ఓ ప్రముఖ దేవాలయం వద్ద నున్న మర్రిచెట్టుకి వేళ్ళాడ తీస్తారు.

వాటిని చదివే విక్రమ్ తన దైన శైలిలో పరిష్కరస్తూ వారి దృష్టిలో దేవుడిలా ఎదుగుతాడుట. వారంతా దైవం మల్లన్నే ఈ పనులన్నీ చేసాడని భావిస్తూంటారుట. ఇక ఈ సినిమా పూర్తి హాలివుడ్ స్టైల్స్ తో నిండి ఉంటుందిట. ఇక శ్రియ అతన్ని మొదట అడ్డుకున్న తర్వాత అతనికి సహరిస్తూ గ్లామర్ కురిపిస్తూంటుందిట. అంటే 'అపరిచితుడు'లో ఇంటర్ నెట్ కు బదులు ఇక్కడ మర్రిచెట్టు వస్తుందన్నమాట. ఇక ఈ సినిమా గురించి విక్రమ్ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పే దాని ప్రకారం హాలీవుడ్ తరహాలో ఇండియన్ జేమ్స్ బాండ్ లా మల్లన్న కనపడతాడుట. వాళ్లు కూడా బాగా ఇష్టపడతారనే అనుకుంటున్నా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X