విక్రమ్ 'మనోహరుడు' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'మనోహరుడు' చిత్రం రూపొందుతోంది. అమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమాను 2014 సంక్రాంతికి విడుదల చేస్తారని చెన్నై సమాచారం. హాలీవుడ్ చిత్రం 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్'కి పని చేసిన సాంకేతిక నిపుణుల ఆధ్వరంలో విజువల్ ఎఫెక్ట్స్ కార్యక్రమాలు వచ్చే నెలలో మొదలవుతాయి.
విక్రమ్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం శంకర్ దర్శకుడుగా రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం 'ఐ' .
ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు.
ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న 'ఐ' చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ 'ఐ' చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసిందిప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంగీతం: ఏఆర్ రెహమాన్. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.


Click it and Unblock the Notifications











