జూలై రెండోవారంలో ‘నాన్న’తో హ్యాట్రిక్ హిట్ కొడతా..!

By Sindhu

'శివపుత్రుడు, అపరిచుతుడు, మల్లన్న' ఇలా వైవిధ్య భరితమైన చిత్రాల్లో నటించి, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ హీరోగా రూపొందిన తాజా తమిళ చిత్రం 'దైవ తిరుమగల్'. ఈ చిత్రాన్ని వెల్ఫేర్ క్రియేషన్స్ అధినేత డాక్టర్ మళ్ళ విజయ ప్రసాద్ తో కలిసి సంతోషం స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జులై రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ 'ప్రేమిస్తే, షాపింగ్ మాల్ లాంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మా సంస్ధ నుండి వస్తున్నా మూడో చిత్రం 'నాన్న'. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది. తద్వారా మేం హ్యాట్రిక్ హిట్ సాధించినట్లు అవుతుంది. బలమైన కదా, అంటే బలమైన స్క్రీన్ ప్లే తో రూపొందిన ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. ఇందులో విక్రమ్ మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా అద్భుతమైన నటన కనబరచారు. పూర్తి స్ధాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బ్రాహ్మణా యువతి గా అనుష్క నటనకు అవకాసం వున్నా పాత్రను పోషించారు. ఒక విజయవంతమైన సినిమాకి కావాల్సిన అన్ని హంగులు వున్నా చిత్రం ఇది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ అవుతుంది. పాటల చిత్రీకరణను దర్శకుడు విజయ్ అద్భుతంగా చేసారు' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X