హాట్ టాపిక్ : వెంకటేష్, విక్రమ్ కాంబినేషన్
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో విక్రమ్,వెంకటేష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందా అంటే అవునని అంటున్నాయి తెలుగు సిని వర్గాలు. ఓ మైగాడ్ (బాలీవుడ్ చిత్రం) రీమేక్ లో కృష్ణుడు పాత్రకు గానూ విక్రమ్ ని అడుగుతున్నారని సమాచారం...వెంకటేష్ సినిమాలో మరో కీలకపాత్ర అయిన ..పరేష్ రావల్ పోషించిన పాత్రను పోషించే అవకాసం ఉందని చెప్తున్నారు. తడాఖా దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. అయితే విక్రమ్ వద్ద పెట్టిన ఈ ప్రపోజల్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని,అందుకోసం ఎదురుచూస్తున్నట్లు చెప్తున్నారు.
మొదటి నుంచీ అల్రెడీ ప్రూవ్ అయిన రీమేక్ కథలు ఎంచుకోవడంలో ఉత్సాహం చూపిస్తూ వస్తున్నారు వెంకటేష్. ఇటీవలే 'బోల్ బచ్చన్' అనే హిందీ చిత్రాన్ని 'మసాలా'గా చూపించారు. ఇప్పుడు మరో బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేయాలనుకొంటున్నట్టు సమాచారం. అదే.. 'ఓ మై గాడ్'.
అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించిన 'ఓ మై గాడ్' చిత్రం మంచి విజయం సాధించింది. 'ఓ మై గాడ్' రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చేజిక్కించుకొంది. ఓ ప్రక్కన స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రం విషయంలో ఇంకా డైలమోలో ఉన్నట్లు సమాచారం. వరసగా నాగవల్లి, బాడీగార్డ్, మసాలా రీమేక్ చిత్రాలు డిజాస్టర్ ఫలితాలు పొందటంతో రీమేక్ చేద్దామా...స్టైయిట్ చిత్రం చేద్దామా అనేది తేల్చుకోలోకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే సురేష్ బాబు మాత్రం ఈ సారి ఖచ్చితంగా 'ఓ మై గాడ్' రీమేక్ ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
వెంకటేష్ లాంటి మంచి నటుడు ఇలా రీమేక్ చట్రంలో ఇరుక్కోపోవటం మాత్రం ఆయన అభిమానులకు రుచించటం లేదు. ఓ మైగాడ్ చిత్రం కాన్సెప్టు ఇక్కడ మన తెలుగు వారికి ఎంత వరకూ ఎక్కుతుందనే సందేహం వెళ్లబుచ్చుతున్నారు. గతంలోనూ నాగార్జున ...మంచు విష్ణు తో కలిసి కృష్ణార్జున అనే చిత్రం చేసారు. అందులో ఆయన మోడ్రన్ శ్రీకృష్ణుడుగా కనిపించారు. కానీ ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పాత్రనే వెంకటేష్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications












