ఓ మణిరత్నం, ఓ శంకర్, ఓ రాజమౌళి..అంటున్న స్టార్ హీరో
News
oi-Surya Prakash Josyula
By Srikanya
మగధీర సినిమా సృష్టించిన సంచలనం గురించి, సాధించిన రికార్డుల గురించి విన్నాను. చూడాలన్న ఉత్సుకత బాగా పెరిగిపోయింది. అందుకే హైదరాబాద్ రాగానే స్పెషల్ షో వేయించుకుని చూశాను అంటున్నారు విక్రమ్. ఆయన లేటెస్ట్ గా రాజమౌళి చేసిన మగధీర చిత్రం చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన మాటల్లోనే..సినిమా అంటే అది! రామ్‌చరణ్ అదరగొట్టాడు. హాలీవుడ్‌లో స్పీల్‌బర్గ్, జేమ్స్‌కామరూన్‌లాగా మన దక్షిణాదికి ఓ మణిరత్నం, ఓ శంకర్, ఓ రాజమౌళి ఉన్నందుకు మనమంతా ఆనంద పడాలి. చాలా చిన్న వయసులోనే ఇంత వండర్ చేసిన రాజమౌళిని చూసి దక్షిణాది వారు గర్వపడాలి, నాక్కూడా ఆయనతో ఓ సినిమా చేయాలనిపిస్తోంది అన్నారు. అంటే త్వరలో రాజమౌళి, విక్రమ్ కాంబినేషన్ సినిమా ఉండే అవకాంశం ఉందన్నమాట.