అంతా సెట్.. మీ వల్లే ఇలా.. ఎమోషనల్ అవుతూ వీడియో విడుదల చేసిన విక్రమ్
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ గుండె పోటు కారణంగా హాస్పిటల్ లో చేరారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని ఆయన చేరిన హాస్పిటల్ సహా ఆయన కుమారుడు, మేనేజర్ కూడా వేర్వేరుగా స్పందించి ఆ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా తాను కోలుకున్నా అంటూ విక్రమ్ ఒక వీడియో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

జ్వరం లక్షణాలతో
శుక్రవారం మధ్యాహ్నం విక్రమ్ గుండెపోటు కారణంగా చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు అంటూ మొదట తమిళ మీడియాలో ప్రచారం మొదలైంది. అక్కడ నుంచి ఇతర భాషల మీడియాలకు కూడా విషయం చేరడంతో విక్రమ్ గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరినట్లు దాదాపు ప్రచారం మొదలైంది. అయితే మధ్యాహ్నం దాటిన తర్వాత సాయంత్రానికి ఆయన హాస్పిటల్ లో చేరింది నిజమే కానీ అది తీవ్రమైన జ్వరం లక్షణాలతోనే అనే విషయం మీద క్లారిటీ వచ్చింది.

గుండెపోటు అంటూ
ఈ విషయాన్ని విక్రమ్ మేనేజర్ మీడియాకు సమాచారం అందించడంతో కొంతమేర తమిళ్ మీడియాలో జ్వరం వార్తలు వచ్చాయి. అయితే తెలుగు మీడియాలో ఇంకా ఇలాంటి వార్తలు మీద క్లారిటీ రాకపోవడంతో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ మీడియా మీద ఫైర్ అయ్యారు. అసలు ఎలాంటి వార్తలు రాస్తున్నారో తెలుసుకుని వార్తలు రాయాలని తన తండ్రి జ్వరంతో హాస్పిటల్ కి వెళ్తే ఇలా గుండెపోటు అంటూ ప్రచారం చేయడం తగదని అన్నారు.

ధన్యవాదాలు
ఆయన బాగానే ఉన్నారని టెస్టులు జరుగుతున్నాయని అవి పూర్తి అయ్యాక ఆయన డిశ్చార్జ్ అవుతారని చెప్పుకొచ్చారు. ధృవ్ చెప్పినట్టుగానే విక్రమ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అంతేకాక ఒక వీడియో కూడా విడుదల చేశారు. తాను ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నానని తనకు ఆరోగ్యం సహకరించనప్పుడు తన గురించి ప్రార్థించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

కోబ్రా
సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన తమిళంలోని ఎక్కువ సేపు మాట్లాడారు. తన ఆరోగ్యం ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉందని ఇకమీదట ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని భావిస్తున్నానని విక్రమ్ చెప్పుకొచ్చారు. ఇక విక్రం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆయన ఈ మధ్యే మహాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ధియేటర్లలో విడుదల కాలేదు కానీ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆయన నటించిన కోబ్రా సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

టీజర్ రిలీజ్
ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అతి త్వరలో జరగబోతోంది. అలాగే పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను మణిరత్నం తెరకేక్కించగా, మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మరోపక్క విక్రమ్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు అనే వార్తలు వచ్చిన రోజే ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ కూడా చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి హాజరు అవ్వాల్సి ఉండగానే ఆయన హాస్పిటల్ పాలు అవ్వడంతో ఈ ఈవెంట్ కి హాజరు కాలేక పోయారు.


Click it and Unblock the Notifications











